Begin typing your search above and press return to search.
ముందు ఉషపై సినిమా తియ్యండయ్యా
By: Tupaki Desk | 25 Aug 2016 5:23 AM GMTప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పై సినిమాలు తెగ వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చినవాటికి ఆదరణ కూడా బాగానే దక్కుతుండడంతో మరిన్ని ప్రపోజల్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే.. ఫిమేల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లో సానియా మీర్జా స్టోరీపై చాలా కాలం నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సంచలనం పీవీ సింధుపై కూడా బయోపిక్ తీసేయచ్చని టాక్ నడుస్తోంది.
ఇలాంటి సమయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దాదాపు ఇండియన్స్ అందరికీ తెలిసిన ఓ మహిళా రన్నర్ పై సినిమా తీయాలన్నది సోనమ్ సూచన. ఆమె ఎవరో కాదు.. పీటీ ఉష. ఏషియన్ గేమ్స్ లో ఎన్నో మెడల్స్ సాధించి.. పదేళ్ల పాటు కెరీర్ ని పీక్ స్టేజ్ లో కొనసాగించిన ఈ ఫిమేల్ అథ్లెట్ పై బయోపిక్ బాగుంటుందని.. ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తుందని సోనమ్ అంటోంది.
1986 ఏషియన్ గేమ్స్ లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించిన పీటీ ఉష.. మరో ఆరు సిల్వర్ మెడల్స్ ను కైవసం చేసుకుంది. ఈ రికార్డు ఏ మహిలా అథ్లెట్ కెరీర్ లోనూ లేదు. ఈ ట్రాక్ రికార్డు చూస్తుంటే సోనమ్ కపూర్ ఆలోచన కరెక్టే అనిపిస్తోంది కదూ. రెండు దశాబ్దాల క్రితం.. ఎవరైనా స్పీడ్ గా పరిగెడుతుంటే.. పీటీ ఉషలా పరిగెడుతున్నారనే మాట వినిపించేదంటే.. ఈ అథ్లెట్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.