Begin typing your search above and press return to search.
ట్వింకిల్ హత్య పై సోనమ్ స్పందన.. ట్రోల్స్!
By: Tupaki Desk | 8 Jun 2019 7:20 AM GMTదేశంలో ఏవైనా దారుణ సంఘటనలు జరిగినప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ స్పందన తెలుపుతారు. కొందరు ఇంకా ముందుకెళ్ళి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తారు. రీసెంట్ గా అలీగడ్ లో ట్వింకిల్ శర్మ అనే మూడేళ్ళ పాప హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్వింకిల్ తల్లిదండ్రులు రూ. 10000 అప్పు తీర్చలేదని మొహమ్మద్ జాహిద్ అనే అప్పిచ్చిన వ్యక్తి ట్వింకిల్ ను దారుణంగా చంపాడు.
ఈ సంఘటనపై స్పందించిన సోనమ్ కపూర్ "ట్వింకిల్ కు జరిగినది దారుణం. ఘోరాతి ఘోరం. ఆమె కోసం.. ఆమె కుటుంబ సభ్యుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. స్వార్థపూరిత ప్రయోజనాలతో ఈ సంఘటనను పెద్దది చేయవద్దు. ఇది చిన్న పిల్ల మరణం. మీ ద్వేషాన్ని విరజిమ్మవద్దు" అంటూ ట్వీట్ చేసింది. సోనమ్ ట్వీట్ సహజంగానీ బీజేపీ వారికి ఆగ్రహం తెప్పించింది.
గతంలో అసిఫా హత్య సంఘటన జరిగిన సమయంలో కరీనా కపూర్.. సోనమ్ కపూర్.. స్వరా భాస్కర్ లాంటి వారు ప్లకార్డులు పట్టుకొని "జస్టిస్ ఫర్ అసిఫా" అంటూ ఫోటోలు షేర్ చేసి ఎంతో ఆగ్రహం ప్రదర్శించారు. అప్పుడు ఎవరినీ సంయమనం పాటించమని కోరలేదు. కానీ ఇప్పుడు కరీనా.. స్వరా భాస్కర్ లు ట్వింకిల్ హత్య విషయంపై అసలు స్పందించలేదు. స్పందించిన సోనమ్ మాత్రం ..దారుణమైన హత్య అంటూనే 'ద్వేషాన్ని పెంచవద్దు' అని క్లాస్ పీకుతోంది. ఇదే విషయాన్ని బీజెపీ కి చెందిన ప్రీతీ గాంధి ఎత్తి చూపారు. "కథువా రేప్ కేసుకు సిగ్గు లేకుండా మతం రంగు పులిమి.. ద్వేషాన్ని పెంచి.. ఇప్పుడేమో పక్కవాళ్ళకు ద్వేషాన్ని పెంచవద్దు అని క్లాసులు పీకుతున్నారు. బాధితుల మతాన్ని బట్టి.. మీ సినిమాల రిలీజ్ టైమింగ్ ను బట్టి బాధితులపై మీ స్పందన మారుతుంది. #జస్టిస్ ఫర్ ట్వింకిల్ శర్మ " అంటూ ట్వీట్ చేశారు.
దీంతో నెటిజనులలో భారీ చర్చ మొదలైంది. మెజారిటీ నెటిజనులు సోనమ్ తీరును తప్పు పడుతూ అందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాలని విమర్శిస్తున్నారు. కానీ కొందరు లౌకిక వాదులమని చెప్పుకునే వారు మాత్రం సోనమ్ ను సమర్థిస్తూ.. బీజీపీ లీడర్లపై మండిపడ్డారు.