Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫ‌్యాష‌న్ వ‌ర‌ల్డ్ షేక‌వ్వాలి

By:  Tupaki Desk   |   2 July 2019 11:30 AM GMT
ఫోటో స్టోరి: ఫ‌్యాష‌న్ వ‌ర‌ల్డ్ షేక‌వ్వాలి
X
బాలీవుడ్ క‌థానాయిక‌ సోనమ్ క‌పూర్ అనుస‌రించే ఫ్యాష‌న్స్ నిరంత‌రం నెటిజ‌నుల్లో హాట్ టాపిక్. ఫ్యాష‌నిస్టా సోన‌మ్ ఎంపిక‌ల ముందు ప్యారిస్ అయినా త‌లొంచాల్సిందే. కేవ‌లం హాలీవుడ్ స్టార్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే.. అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ డ్రెస్ ల‌ను- స్టైల్ ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసిన ట్రెండీ ఫ్యాష‌నిస్టా సోన‌మ్. నేటి జ‌న‌రేష‌న్ లో ది బెస్ట్ అని.. త‌నలా వేరొక క‌థానాయిక‌కు సాధ్యం కాద‌ని ప్రూవ్ చేసింది.

అందుకే అభిమానులు సోన‌మ్ ప‌రిచ‌యం చేసే ఫ్యాష‌న్స్ & ట్రెండ్స్ ని నిరంత‌రం ప‌రిశీలిస్తుంటారు. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం లేనిదే సోన‌మ్ ఆ డ్రెస్ ని ధ‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌ద‌ని ఫ్యాష‌న్ స్పెష‌లిస్టులు.. డిజైన‌ర్లు చెబుతుంటారు. ఇటీవ‌లే కేన్స్ రెడ్ కార్పెట్ పై సోన‌మ్ హొయ‌లు కుర్ర‌కారుపై మ‌త్తు చ‌ల్లాయి. స‌రికొత్త ఫ్యాష‌న్ గోల్స్ ని యూత్ కి నిర్ధేశించింది సోన‌మ్. ఆ ఈవెంట్ ని మ‌ర్చిపోక ముందే ఇదిగో ఇలా కొత్త‌గా త‌న‌ని తాను మ‌రోసారి ఎలివేట్ చేసుకుంది ఈ బ్యూటీ.

నేటితో ఇన్ స్టాగ్ర‌మ్ లో 2 కోట్ల మంది (20 మిలియ‌న్) ఫాలోవ‌ర్స్ ని సోన‌మ్ సంపాదించుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానుల కోసం ఓ స్పెష‌ల్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆలివ్ గ్రీన్ డ్రెస్ లో మైమ‌రిపించింది. హాఫ్ షోల్డ‌ర్ టైట్ ఫిట్ ఎలివేష‌న్ లో సోన‌మ్ అందాలు హైలైట్ అయ్యాయి. కాంబినేషన్ గా బ్లాక్ మెటాలిక్ డిజైన‌ర్ హ్యాండ్ బ్యాగ్ తో మురిపించింది. ``2 కోట్ల మంది అభిమానుల కోసం ఈ ఫోటో ..` అంటూ పోస్ట్ చేసింది. సోన‌మ్ ప్ర‌స్తుతం `ది జోయా ఫ్యాక్ట‌ర్` అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దుల్కార్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.