Begin typing your search above and press return to search.

మేకప్ లేకుండా మొహం చూపించదట

By:  Tupaki Desk   |   20 Aug 2016 7:48 AM GMT
మేకప్ లేకుండా మొహం చూపించదట
X
అందాల భామల సీక్రెట్ అంతా మేకప్ లోనే దాగి ఉంటుంది. మేకప్ వేసుకున్నాక కెమేరా ముందు ఏ రేంజ్ లో రెచ్చిపోతారో అందరికీ తెలుసు. కానీ అది లేకుండా కెమేరా ముందు కనిపించమంటే.. వీళ్లకి ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది. కొంతమంది తమ ఫీలింగ్స్ ని దాచుకునేందుకు ట్రై చేస్తారు కానీ.. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం చిరాకును కూడా ఎక్స్ ప్రెస్ చేసేస్తోంది.

ఓ చిన్న హెల్త్ ప్రాబ్లెమ్ తో ముంబై బాంద్రాలోని ఓ హాస్పిటల్ కి వెళ్లింది సోనమ్ కపూర్. తిరిగొచ్చేసరికి రోడ్డు మీద చాలామంది కెమెరా వారు సిద్ధంగా ఉన్నారు. అమ్మడు అప్పుడు పర్సనల్ పని మీద బైటకు రావడంతో.. అసలు మేకప్ జోలికే పోలేదు. సోనమ్ ఒరిజినల్ అందాలను కెమేరాలో బంధించేందుకు కెమేరా పర్సన్ ట్రే చేస్తే.. కెమేరా చూడగానే ఈ భామకు ఒళ్లు మండిపోయింది. ఏంటిదంతా.. ఇప్పుడు ఫోటోలు తీస్తారా అన్నట్లుగా ఓ లుక్ ఇచ్చి.. సీరియస్ గా కార్ దగ్గరకు వెళ్లిపోయింది.

కార్ ఎక్కే ముందు కూడా ఓ సీరియస్ లుక్ ఇచ్చింది లెండి. నా చూపుకే గానీ పవర్ ఉంటేనా అన్నట్లుగా ఉంది సోనమ్ వాలకం. మేకప్ తో ఉంటే.. ఈ భామ ఇంతగా ఫీలయ్యేది కాదనే మాట ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ కవరింగ్ లేకపోవడంతోనే.. ఇలా చూపులతో షివరింగ్ తెప్పించేందుకు ట్రై చేసింది.