Begin typing your search above and press return to search.
తల్లి కాబోతున్న సోనమ్ కపూర్.. ఫోటోలు వైరల్!
By: Tupaki Desk | 21 March 2022 8:30 AM GMTబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తల్లికాబోతుంది. మాతృమూర్తిగా సోనమ్ కపూర్ ప్రమోట్ అవుతుంది. మరికొన్ని నెలల్లో అందమైన సోనమ్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అమ్మా అన్న పిలుపుకు నోచుకోబోతుంది. అవును ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా సోనమ్ కపూర్ బేబి బంప్ ఫోటోలతో రివీల్ చేసింది. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా ఒడిలో పడుకుని ఉన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో సోనమ్ నలుపు రంగు స్కిన్ టైట్ దుస్తుల్లో కనిపిస్తున్నారు.
అదే సమయంలో సోనమ్ గర్భీణీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు మీడియా కంట పడకుండా..ఎక్కడా విషయాన్ని రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచిన సోనమ్ నేడు అసలు విషయాన్ని చెప్పేసింది. ``నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా పెంచడానికి ప్రయత్నిస్తాం.
రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటున్నాయి. నీకుటుంబం నీకు ప్రేమ-మద్దతుని ఎల్లప్పుడు అందిస్తుంది. మేము నిన్ను స్వాగతించడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాము. ఆగడియలు కోసం కళ్లు కాయలు లు కాచేలా ఉన్నాయని`` సోనమ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
దీంతో బాలవుడ్ సెలబ్రిటీలు సహా నెటి జనులు సోనమ్ దంపతులకి శుభాకాంక్షలు చెబుతున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరోకుంటున్నారు. బాలీవుడ్ లో అనీల్ కపూర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ పలు సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత 2018లో వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగించింది. అయితే గర్భం దాల్చడంతో సినిమాలకు దూరమైంది. ఆ విషయాన్ని ఇన్ని రోజుల పాటు రహస్యంగా ఉంచింది.
నెలలు నిండుతోన్న నేపథ్యంలో విషయాన్ని మీడియాకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుంచి సోనమ్ తరుచూ ఇన్ స్టా లో యాక్టివ్ గా కొనసాగొచ్చు. విషయం చెప్పేసింది కాబట్టి నెటి జనులు కొన్నాళ్ల పాటు సోనమ్ ని బేబి బంప్ లుక్ లోనూ చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే చందమామ కాజల్ అగర్వాల్ బేబి బంప్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతోన్న సంగతి తెలిసిందే.
కాజల్ గర్భం దాల్చిన దగ్గర నుంచి నిత్యం కొత్త ఫోటో షూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. మరి ఆ తరహా ప్రయత్నం సోనమ్ కపూర్ చేస్తుందా? లేక కపూర్ వంశం కట్టుబాట్లు ప్రకారం ముందుకు వెళ్తుందా? అన్నది తెలియాలి. డెలివిరీ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని సోనమ్ కపూర్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉంద.