Begin typing your search above and press return to search.

తాళికట్టగానే బుగ్గపై ముద్దెట్టింది

By:  Tupaki Desk   |   8 May 2018 4:46 PM GMT
తాళికట్టగానే బుగ్గపై ముద్దెట్టింది
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహం ఎట్టకేలకు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా జరిగింది. ఇరుకుటుంబాల సమక్షంలో సోనమ్ - ఆనంద్ అహుజా ఇద్దరు ఒకటయ్యారు. దీంతో సెలబ్రెటీల నుంచి సినీ అభిమానుల వరకు అందరి నుంచి ఈ కొత్త జంటకు విషెష్ అందుతున్నాయి. ప్రేమించుకొని ఒకటయిన ఈ జంట ఒక్కటవ్వడం కుటుంబ పెద్దలకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇద్దరు ప్రేమకు ఉన్న గౌరవాన్ని పెళ్లితో మరింత పెంచారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

అలాగే పెళ్లికి సంబందించిన ఫొటోలు వీడియోలు ఇక ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అన్ని ఫొటోలకు మంచి కామెంట్స్ అందుతున్నాయి. అయితే ఒక్క వీడియో మాత్రం అందరిని ఎక్కువగా ఆకర్షించింది. ఆకాష్ సోనమ్ కి బొట్టు పెడుతూ తాళి కట్టే సమయంలో తీసిన వీడియో ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే సోనమ్ ఆ సమయంలో నవ్వుతూ తన భర్త బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టింది.

మరొకరు సైడ్ నుంచి ఇప్పుడు నువ్ Mrs.ఆనంద్ అహుజా అంటూ కామెంట్ చేయడంతో అందరి ఫెస్ లో చిరునవ్వులు మెరిశాయి. ఆ వీడియో చూసి సెలబ్రెటీలు కూడా కొత్త జంట ఇలానే కలకాలం కలిసి ఉండాలని బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. శ్రీదేవి చనిపోయిన తరువాత కపూర్ ఫ్యామిలిలో మొదటి శుభకార్యం కావడంతో అందరూ చాలా కాలం తరువాత వేడుకని సంతోషంగా జరుపుకున్నారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి