Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ళకు నటించింది నాయనా!!

By:  Tupaki Desk   |   19 Feb 2016 9:00 PM IST
ఎన్నాళ్ళకు నటించింది నాయనా!!
X
మామూలుగా అవార్డు ఫంక్షన్ లంటే క్లీవేజ్‌ కనిపించేలా బట్టలు వేసుకురావడం.. ఎవ్వరూ ఎప్పుడూ బాలీవుడ్‌ లో ధరించని బట్టలు వేసుకొని.. బ్రా లెస్‌ లుక్‌ తో అదరగొట్టడం.. ఆ విధంగా సినిమాల్లో పాపులర్‌ అయ్యిందే తప్పిస్తే.. ఒక్కసారైన ఒక నటిగా నిజంగా ఎప్పుడైనా మెప్పించిందేంటండీ మన సోనమ్‌ కపూర్‌? అబ్బే ఎప్పుడూ లేదు.

ఈమె చాలా కష్టపడి నాజూకైన బాడీని సొంతం చేసుకొని బికినీ వేసినా కూడా.. నువ్వు కేక హీరోయిన్‌ అని ఎవ్వరూ అనలేదు. అయితే ఇప్పుడు మాత్రం నీరాజనాలు అందుకుంటోంది. ''నీర్జా'' సినిమాలో ఎయిర్‌ హోస్టెస్‌ నీర్జా బానోత్‌ గా ఈమె నటన సూపరుందని ఇప్పడు అందరూ కితాబిస్తున్నారు. ఏ క్రిటిక్‌ను అడిగినా కూడా.. ఇవాళ రిలీజైన నీర్జా సినిమాలో సోనమ్‌ తొలిసారిగా అబ్బురపరిచే నటన కనబరిచింది అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఎప్పటి నుండి సోనమ్‌ అభిమానులు కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకే.. ఎన్నాళ్ళకు నటించింది నాయనా అంటూ వారు కూడా ఊపిరి పీల్చుకున్నారులే.

ఇకపోతే ''నీర్జా'' సినిమాను తీసిన దర్శకుడు రామ్‌ మద్వాని కూడా నీరాజనాలు అందుకుంటున్నాడు. సినిమాలో షబానా ఆజ్మి కూడా అద్భుతమైన నటన కనరబరిచిందని చెప్పొచ్చు.