Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సోనమ్ మెరుపులు

By:  Tupaki Desk   |   22 May 2017 12:26 PM GMT
ఫోటో స్టోరి: సోనమ్ మెరుపులు
X
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సుందరీమణుల హంగామా పెరిగిపోతోంది. విదేశీ భామలకు ఏ మాత్రం తీసిపోకుండా మన భామలు రెచ్చిపోయి సోయగాలు ప్రదర్శించేస్తున్నారు. ఇతర భారతీయ భామలతో పోల్చితే.. కేన్స్ ఫెస్టివల్ మొదటి రోజున సోనమ్ కపూర్ భిన్నంగా కనిపించింది.

ఇండియన్ వేర్ తో అలరించిన సోనమ్.. చీరకట్టు సింగారంతో తొలిరోజున కనిపించింది. కానీ రెండో రోజుకు వచ్చేసరికి ఆసాంతం స్టైల్ మార్చేసిన సోనమ్ కపూర్.. తనదైన బాటలో క్లీవేజ్ షో చేసిపారేసింది. రోజ్ గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ లో సోనమ్ చూపించిన సొగసులు చూడగానే ఇట్టే ఆకట్టుకున్నాయి. వైడ్ లెగ్గెడ్ ప్యాంట్స్ కి.. ఇండియన్ స్టైల్ ఎంబ్రాయిడరీ చేసించిన స్టైల్ అయితే అదరహో అనాల్సిందే. నడుం భాగం ఎక్స్ పోజ్ చేస్తూ.. క్లీవేజ్ షోకి ఇంపార్టెన్స్ ఇస్తూ.. అమ్మడు ధరించిన ఔట్ ఫిట్స్ అన్ని యాంగిల్స్ లోనూ ఆకట్టుకున్నాయి.

చూసేందుకు వెస్ట్రన్ వేర్ అనిపిస్తున్నా.. ఇండియన్ డ్రెసింగ్ కే వెస్ట్రన్ టచ్ ఇచ్చి మెరుపులు మెరిపించింది సోనమ్ కపూర్. ఏమైనా కేన్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై ఇండియన్ కల్చర్ ని అల్ట్రామోడర్న్ గా ప్రెజెంట్ చేస్తున్న సోనమ్.. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయిపోతోంది.