Begin typing your search above and press return to search.

క్రూయిజ్ లో సోనమ్ పార్టీ అదుర్స్

By:  Tupaki Desk   |   1 Jan 2016 2:30 PM GMT
క్రూయిజ్ లో సోనమ్ పార్టీ అదుర్స్
X
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి.. ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఆప్షన్స్ బోలెడుంటాయి. డెస్టినేషన్స్ లెక్కకు మించి ఉంటాయి. ఒక్కోటీ ఒక్కో అనుభూతిని పంచుతుంది. మరి ఇన్నింటిలో ఏది బెస్ట్ అని ఎంపిక చేసుకోవడం క్లిష్టమైన విషయమే. కానీ.. అసలు న్యూ ఇయర్ పార్టీని ఎలా ఎంజాయ్ చేయాలో చేసి చూపించింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.

మాల్దీవ్స్.. ఏ అకేషన్ కి అయినా సూపర్బ్ హాలీడే స్పాట్ ఇది. భూమి మీద కట్టిన స్వర్గం అంటూ బోలెడన్ని పొగడ్తలున్నాయి ఈ ప్లేస్ కి. అందుకే కొత్త సంవత్సరాన్ని ఇక్కడికే చెక్కేసింది సోనమ్. అంతేనా.. ఓ పెద్ద బోట్ పై పార్టీ సెట్ చేసుకుంది. బోట్ అంటే ఆషామాషీ కాదు. అదో పెద్ద క్రూయిజ్. అందులో దొరకని సుఖం అనేది ఉండదనుకోండి. స్విమ్మింగ్ పూల్ తో సహా సకల సౌకర్యాలు ఉంటాయి. సముద్రంలో తిరిగే క్రూయిజ్ లో స్విమ్మింగ్ పూల్ ఎందుకు లాంటి ప్రశ్నలు వేస్తే.. ఏం చెప్పలేం కానీ.. అలాంటి బోట్ లో తిరుగుతూ న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడమంటే మాత్రం.. అదుర్స్ అనాల్సిందే.

ఇక ఇలాంటి పార్టీలకు ఫ్రెండ్స్ ను వేసుకుని వెళ్తే ఆ మజా ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలదు. అందుకే.. ఎంచక్కా ఫోటోలు - వీడియోలు తీసి పోస్ట్ చేసింది సోనమ్ కపూర్. ఇక అందరూ కలిసి చేసిన అల్లరి, హడావిడి ఫోటోల్లోనే ఇంతగా ఉంటే.. ఇక రియల్ గా ఏ రేంజ్ లో కుమ్మేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా పార్టీ చేసుకోవడం విషయంలో సోనమ్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేసిందంటున్నారు చాలామంది. ఓ సారి ఈ భామ చేసిన సందడిని ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫోటోల్లో గనక చూస్తే.. నెక్ట్స్ ఇయర్ న్యూ ఇయర్ కి ఎవరైనా సరే.. ఇప్పుడే మాల్దీవ్స్ కి టికెట్ బుక్ చేసేసుకుంటారు.