Begin typing your search above and press return to search.

రానా ప్రేమ పై స్పందించిన స్టార్ హీరోయిన్..

By:  Tupaki Desk   |   13 May 2020 5:30 PM GMT
రానా ప్రేమ పై స్పందించిన స్టార్ హీరోయిన్..
X
టాలీవుడ్ టాల్ హీరో రానా.. త‌న పెళ్ళికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇలా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడో లేదో.. అలా సోషల్ మీడియా మొత్తం పాకి సెలబ్రిటీల కంట్లో పడింది. వాళ్లు ఊరుకుంటారా.. ఈ మధ్య ఫ్యాన్స్ కంటే సెలబ్రిటీలే ముందుగా స్పందించడం ప్రారంభించారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. లాక్ డౌన్ కదా.. ఇంకా షూటింగ్స్, సినిమాలు ఆగిపోవడంతో ఖాళీగా ఉంటూ.. ఇలా సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉంటున్నారని ఈ మధ్య వారి పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. రానా తన ప్రేమను ఫోటోతో సహా పోస్ట్ చేసేసరికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మొదటగా స్పందించి.. "చివరికి భళ్లాల దేవుడు అంతటి ధీశాలి కూడా ప్రేయసి వలలో చిక్కుకున్నాడు" అంటూ ఫన్నీ ట్వీట్ చేసి ఇద్ద‌రికి ఆశీర్వాదాలు తెలిపారు.

ఇక తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ కూడా రానా-మిహీక ప్రేమ ప్ర‌క‌ట‌న పై స్పందించి.. మిహీకతో తనకున్న అనుబంధం గురించి పోస్ట్ చేసింది. ''డార్లింగ్ బేబీ మిహీక‌.. ఇవే నా శుభాకాంక్ష‌లు. ఐ ల‌వ్ యూ డాల్‌. నీకు స‌రిజోడిని ఎంపిక చేసుకున్నావు. నిన్ను సంతోషంగా చూసుకుంటాడు. ల‌వ్ యూ బోత్‌.. మా కుటుంబంలోకి నీకు ఘనస్వాగ‌తం రానా..'' అంటూ సోన‌మ్ క‌పూర్ త‌న పోస్ట్‌లో విష్ చేసింది. ఇదివరకే మిహీకా - సోన‌మ్ మంచి స్నేహితులు. ఇక వాళ్ల ఫ్రెండ్స్ సర్కిల్ లోకి రానా కూడా చేరిపోయాడు. డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వ‌హిస్తున్న మిహీకాకి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మిహీక.. సోన‌మ్‌ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో తనకు సంబంధించిన అన్ని ఫంక్షన్స్‌లోను సంద‌డి చేస్తుంది. ఇదే మంచి టైం అనుకున్న సోన‌మ్.. మిహీకాతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.