Begin typing your search above and press return to search.

అహూజాతో సోన‌మ్ పెళ్లికి కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   17 July 2018 5:26 PM GMT
అహూజాతో సోన‌మ్ పెళ్లికి కార‌ణ‌మిదే!
X
బాలీవుడ్ హీరో అనిల్‌ కపూర్ ముద్దుల కూతురు సోనమ్‌ కపూర్ వివాహం ఈ ఏడాది మే 8న‌ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో సోన‌మ్ పెళ్లి జ‌రిగింది. ఫ్యాష‌న్ ఐకాన్ అయిన సోన‌మ్ ...త‌న పెళ్లిలో కూడా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్ ల‌తో అందరి చూపుల‌ను క‌ట్టిప‌డేసింది. అయితే, ఫ్యాష‌న్ ఫ్రీక్ అయిన సోనన్....ఆనంద్ ను వివాహం చేసుకోవ‌డానికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంద‌ట‌. త‌న భ‌ర్త ఆనంద్‌ అహుజా కూడా ఫ్యాషన్‌ ప్రియుడేన‌ని - అందుకే ఆయ‌న‌ను వివాహం చేసుకున్నాన‌ని సోన‌మ్ చెప్పింది. త‌మ ఇద్ద‌రి ఫ్యాషన్ అభిరుచులు ఒకటేన‌ని, ఆ ఆసక్తే తమను జంట‌గా క‌లిపింద‌ని తెలిపింది. త‌మ ఫ్యాష‌న్ ముచ్చ‌ట్ల‌ను సోన‌మ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఫ్యాషన్‌ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందేన‌ని, తాను ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుంది కూడా అందుకేన‌ని సోన‌మ్ చెప్పింది. ఫ్యాషన్‌ రంగంలో, రిటైల్‌ రంగంలో ఆనంద్ స్థిరపడ్డార‌ని, అందుకే త‌న‌కు తొందరగా నచ్చాడ‌ని చెప్పింది. ఫ్యాషన్ పై త‌మ ఇద్ద‌రికీ ఆసక్తి ఉన్నందునే తాము పెళ్లి చేసుకున్నామ‌ని సోన‌మ్ ట్వీట్ చేసింది. తాను ఫ్యాష‌న్ ను ఇష్ట‌ప‌డినంత‌గా....మ‌రెవ‌రూ ఇష్ట‌ప‌డ‌ర‌ని `వోగ్ ఇండియా` చేసిన ట్వీట్ కు సోనమ్ పై విధంగా రీట్వీట్ చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన రిటైల్‌ వ్యాపారి అయిన ఆనంద్‌ అహుజా దేశంలో తొలి మల్టీ బ్రాండ్‌ ‘స్నీకర్‌’ బోటిక్ ను ప్రారంభించారు. అంతేకాకుండా, ‘భనే’ అనే బ్రాండ్ ను కూడా లాంచ్ చేశారు. తామిద్దరి అభిరుచులు క‌ల‌వ‌డం వ‌ల్ల‌నే పెళ్లి చేసుకున్నామ‌ని చెప్పింది.