Begin typing your search above and press return to search.
ట్యాక్సీలో అందగత్తెకు టెర్రర్
By: Tupaki Desk | 17 Jan 2020 1:30 AM GMTప్రయివేట్ ట్యాక్సీలు.. క్యాబులు ఎక్కితే ఆ తర్వాత గమ్య స్థానాలకు చేరడం మాటేమో కానీ మార్గం మధ్యలో ఎన్నో దారుణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మగువలు క్షేమంగా ఇల్లు చేరడం అన్నది కల్లే. మితిమీరిన విచ్చలవిడి పాశ్చాత్య కల్చర్ దేశంలో ప్రవేశించడం దారుణాలకు కారణమవుతోంది. అయితే ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని చెబుతోంది సోనమ్ కపూర్. ఈ అమ్మడికి లండన్ లో కార్ ప్రయాణం చుక్కలు చూపించిందట. క్యాబ్ డ్రైవర్ తనపై అరిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని సోనమ్ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇకపై ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని.. క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు.
``లండన్ `లో ఉబర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. జనం ప్రయాణించే బస్సులు వాటినే ఆశ్రయించండి. ఊబర్ డ్రైవర్ చేసిన పనికి నేను ఒణికిపోయాను`` అని సోనమ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. డ్రైవర్ అరుపులు భరించలేక తాను క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే లండన్ ప్రయాణంలో బ్రిటీష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యం గురించి సోనమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు సార్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ వల్ల తన బ్యాగ్ పోగొట్టుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇకపై ఈ విమానాలు ఎక్కి ప్రయాణించను అని సీరియస్ అయ్యింది.
ఇప్పటికే బ్రిటన్ లో ఊబర్ సేవల్ని నిలిపేయాలన్న గొడవ ఉంది. అలాంటి దాంట్లో ప్రయాణించడం సోనమ్ తప్పు అని నిలదీసిన వారు కొందరైతే.. ప్రైవేటు ట్యాక్సీలు- క్యాబ్‌లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ తమ అనుభవాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఊబర్ ఇకపై సరికొత్త సాంకేతికతను ఉపయోగించి డ్రైవర్ - ప్రయాణీకుల సంభాషణల్ని రికార్డ్ చేసే `వాయిస్ ఆడియో రికార్డింగ్` వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు ప్రకటించింది.