Begin typing your search above and press return to search.
ట్విట్టర్ కు సోనమ్ కపూర్ టాటా!
By: Tupaki Desk | 6 Oct 2018 4:34 PM GMTసోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు, సినీ తారలకు విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని పోస్టుల విషయంలో కొంతమంది సెలబ్రిటీలు, సినీ తారలు విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలపై ట్రోలింగ్ జరిగింది. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేక రేణు దేశాయ్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పింది. తాజాగా, అదే బాటలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా ట్విట్టర్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. ట్విట్టర్ నుంచి కొంత కాలం పాటు సైన్ ఆఫ్ అవుతున్నానని సోనమ్ ట్వీట్ చేసింది. ట్విటర్ లో చాలా నెగిటివిటీ ఉందని, అందుకే కొంత కాలం ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నాని చెప్పింది. `పీస్ అండ్ లవ్ టూ ఆల్’ అని సోనమ్ ట్వీట్ చేసింది. కానీ, తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో సోనమ్ చెప్పలేదు.
అయితే, కొద్ది రోజుల క్రితం ముంబై కాలుష్యంపై తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో సోనమ్ చేసిన పోస్ట్ పై ట్రోలింగ్ జరిగింది. ఆ నేపథ్యంలోనే సోనమ్ ట్విట్టర్ కు బ్రేక్ ఇచ్చిందని టాక్ వస్తోంది. ముంబైలో రోడ్లు బాగోలేవని, 2 గంటలైనా వెళ్లాల్సిన చోటుకు చేరుకోలేదని సోనమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ముంబైలో విపరీతమైన కాలుష్యం ఉందని, ఇంట్లో నుంచి బయటకు రావడం పీడకలలా ఉందని అని చెప్పింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను సెలబ్రిటీలు వాడరని, సోనమ్ లాగా 3 లేదా 4 కిలోమీటర్ల మైలేజినిచ్చే లగ్జరీ కార్లను ఉపయోగించేవారి వల్లే కాలుష్యం పెరుగుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సోనమ్ వంటి సెలబ్రిటీల ఇళ్లలో 10 నుంచి 20 ఏసీలుంటాయని, గ్లోబల్ వార్మింగ్ కు అటువంటి వారు కూడా బాధ్యులని అన్నాడు. దానికి సోనమ్ ఘాటుగా స్పందించింది. అతడి లాంటి మగవాళ్ల వల్లే మహిళలు బస్సుల్లో ప్రయాణించడం కష్టంగా మారిందని, వేధింపుల భయం పెరిగిపోయిందని రిప్లై ఇచ్చింది.