Begin typing your search above and press return to search.

అదరహో అనిపిస్తున్న సోనమ్.. గ్లామర్ షో!

By:  Tupaki Desk   |   6 April 2021 1:30 AM GMT
అదరహో అనిపిస్తున్న సోనమ్.. గ్లామర్ షో!
X
బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆకట్టుకొనే అందాల ప్రదర్శనతో ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో సోనమ్ పోజులను నోరెళ్ళబెట్టి చూసేవారు కోట్లలో ఉన్నారు. అప్పుడప్పుడు అమ్మడు తనకు పెళ్లి అయిపోయిందనే సంగతి మరిచిపోతుంది. అందుకే గ్లామర్ ప్రియులకు ఓ రేంజిలో నేత్రానందం కలిగేలా సోయగాలను ప్రదర్శిస్తుంది. నిజానికి బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి అయినా కాకపోయినా గ్లామర్ షో చేయడం మాత్రం ఆపలేరు. ఒక్కసారి గ్లామర్ షో చేయాలనీ కమిట్ అయితే గనక వారి భర్తల మాటలు కూడా లెక్కచేయరని టాక్. అలాంటి వారికి సోన‌మ్ కొంచం డిఫరెంట్. భర్తను ఒప్పించి మరీ గ్లామర్ షో చేస్తోందట.

అందుకే ఓసారి అమ్మడి ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. బాలీవుడ్ లో ఎన్ని స్టైలిష్ వయ్యారాలు ఉన్నా వారిలో సోన‌మ్ రూటు మాత్రం సపరేట్. ఎల్లప్పుడూ లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్స్.. జ్యువలరీ ప్రెసెంట్ చేయడంలో అమ్మడు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. ఇండియన్ ట్రెండీ ముద్దుగుమ్మలలో సోనమ్ టాప్ లిస్టులో ఉంటుంది. సోషల్ మీడియాలో సోనమ్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజిలో సంపాదించుకుంది. గ్లామర్ షోలో బార్డర్ క్రాస్ చేయడం అమ్మడికి సరదా. తాజాగా బాజార్ అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది సోనమ్. ఆ ఫోటోలలో ముద్దుగుమ్మ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ తో అదరహో అనిపించింది. బాజార్ 12వ వార్షికోత్సవం సందర్బంగా సోనమ్ ఈ ఫోటోషూట్ జరిపింది. స్టైలిష్ బేబీ పింక్ డ్రెస్ లో హద్దులు దాటిందనే చెప్పాలి. ప్రస్తుతం సోనమ్ ఒంపుసొంపులు చూసి మైమరచిపోతున్నారు అభిమానులు.