Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్లు ఒక మెట్టు ఎక్కువే
By: Tupaki Desk | 24 May 2018 6:58 AM GMTఇండస్ట్రీ ఏదైనా, సినిమా హిట్ అవ్వాలి అంటే ప్రమోషన్స్ కూడా అంతే గట్టిగా చేయాల్సొస్తోంది. అంతకుముందు పలు ఇంటర్వ్యూలలో పాల్గోని సినిమా గురించి చెప్పేవాళ్ళు. ఈ మధ్యన అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవేరకొండ లాగా డైరెక్ట్ గా ఫాన్స్ తోనే ఇంటరాక్ట్ అయిపోతున్నారు. హీరోలను పక్కన పెడితే ప్రమోషన్ల విషయంలో బాలీవుడ్ భామలు ఒక అడుగు ముందే ఉన్నరేమో అనిపిస్తోంది.
ఏడాది కిందటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన కరీనా కపూర్, రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్ - స్వర భాస్కర్ మరియు శిఖ తల్సానియాలు ఇప్పుడు బాలీవుడ్ లో 'వీరే ది వెడ్డింగ్' పేరుతో ఒక సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా చేయడం కోసం వాళ్లు ఎంత గ్లామర్ ఆరబోశారో మన చూశాం. అదంతా సరిపోనట్లు.. ప్రమోషన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. కేవలం ఇంటర్వ్యూలు మీటింగులతో సరిపెట్టకుండా ఈ నలుగురు ఏకంగా డాన్సులు కూడా వేసేస్తున్నారు. ఒక రేడియో షో కి ప్రోమోషన్లకు వెళ్లి అక్కడ అందరితో కలిసి డాన్స్ చేస్తూ సరదాగా ఆడి పాడారు.
దాదాపు 7 లేదా 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అంతటి స్టార్ హీరోయిన్లు కూడా ప్రోమోషన్ల పేరుతో సందడి చేస్తున్నారు. కానీ మన తెలుగులో మాత్రం కొంతమంది ప్రోమోషన్లకు హాజరు కూడా అవ్వట్లేదు. ఒకవేళ అయినా కూడా ఏదో సినిమా గురించి నాలుగు మాటలు చెప్పేసి బై బై అనేస్తున్నారు. ఈ రకంగా బాలీవుడ్ హీరోయిన్లు మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పుకోవచ్చు అంటారా? ఎనీవే.. ఈ విషయంలో మన నిర్మాతలు అండ్ హీరోలు కాస్త ఆలోచించాలి.