Begin typing your search above and press return to search.
ఇంత రియాలిటీ జనాలు తట్టుకుంటారా?
By: Tupaki Desk | 25 May 2018 6:10 AM GMTఫార్ములా సినిమాలు ఎలా వస్తూ ఉంటాయో.. ఎప్పటికప్పుడు కొత్త తరహా కాన్సెప్టులను ప్రయత్నించడం కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ తొలిసారిగా వీరే ది వెడ్డింగ్ మూవీలో.. నలుగురు మహిళల పాత్రలను బాగా ఓపెన్ గా చూపించబోతున్నారు.
ఈ సినిమాలో నటించిన నలుగురు అమ్మాయిలు పార్టీలు చేసుకుంటూ ఉంటారు.. సిగరెట్స్ తాగుతుంటారు.. మందు కొడుతుంటారు.. సెక్స్ కబుర్లు డిస్కషన్ చేస్తుంటారు.. బూతులు కూడా యథేచ్ఛగా మాట్లాడేస్తూ ఉంటారు. అదేమంటే రియాలిటీకి దగ్గరగా తీశామన్నది మేకర్స్ వాదన. ఆ అమ్మాయిలు కూడా అదే చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అయితే పెళ్లికి ముందే సెక్స్ చేసిన చాలా మంది అమ్మాయిలు తనకు తెలుసని అంటోంది. వాస్తవంలో ఏది జరుగుతోందో.. అందుకు దూరంగా సినిమా ఉంటే ఎలా అన్నది ఈమె వాదన. ఇందులోనూ వాస్తవం లేకపోలేదు కానీ.. అందరూ దీన్ని అంగీకరించరు.
సినిమాను కేవలం వినోద సాధనంగా చూడాలని ఎంతమంది వాదిస్తారో.. వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పేవారి సంఖ్య కూడా అంతే ఉంటుంది. సోనమ్ కపూర్.. కరీనా కపూర్.. స్వర భాస్కర్ నటించిన ఈ చిత్రం ఫెమినిస్ట్ మూవీ కాదని.. ఓ నలుగురు అమ్మాయిలు ఎదుర్కొన్న ఇబ్బందులను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశామంటున్నారు. మరి ఇంత రియాలిటీ జనాలు తట్టుకుంటారో లేదో జూన్ 1న తేలనుంది.