Begin typing your search above and press return to search.

డైరెక్షన్ పై కన్నేసిన బాలీవుడ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:52 AM GMT
డైరెక్షన్ పై కన్నేసిన బాలీవుడ్ బ్యూటీ
X
పెళ్లి అయితే హీరోయిన్స్ కెరీర్ లో అన్ని మారిపోతాయి అనే టాక్ ఇప్పటి నుంచి ఇక ఏ ఇండస్ట్రీలో వినిపించాదనే చెప్పాలి. పెళ్లి ఏ విషయానికి అడ్డు కాకూడదు అని ఇండియన్ హీరోయిన్స్ హాలీవుడ్ నటిమణుల్లా ఆలోచిస్తున్నారు. ఇటీవల పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ కె ఆహుజా తన మ్యారేజ్ లైఫ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. స్పెషల్ హానీ మూన్ ట్రిప్పులు కూడా వేసేస్తోంది. అయితే సినీ కెరీర్ ని కూడా ఈ బ్యూటీ గతంలో సాగించినట్టుగానే ఇప్పుడు కూడా కోనసాగిస్తోంది.

అయితే అమ్మడి మనసులో ఎప్పటినుంచో ఒక కోరిక మాత్రం బలంగా ఉందట. అదే డైరెక్షన్. తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని కపూర్ ఫ్యామిలీకి మంచి ప్రతిష్టను తెచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు డైరెక్షన్ లో కూడా సక్సెస్ అందుకొని తన భర్త ఫ్యామిలీకి మరింత గుర్తింపు తేవాలని అనుకుంటోంది. ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ ఈ విధంగా స్పందించింది. సంజయ్ లీలా భన్సాలి - ఆనంద్ ఎల్ రాయ్ - ఆర్ మాధవన్ వంటి ప్రముఖులు అమ్మడిని డైరెక్షన్ లో అడుగులు వేయమని చెప్పారట.

ప్రతి సినిమా షూటింగ్స్ లలో అమ్మడు దర్శకుల నుంచి అనేక పాఠాలను నేర్చుకుందట. ఇప్పటికే చాలా స్క్రిప్టులు విన్నట్లు చెప్పిన సోనమ్ త్వరలో ఒక డిఫరెంట్ కథను ఫైనల్ చేసి అందరికి షాక్ ఇస్తుందట. ఇక ఇటీవల సోనమ్ వీరే ది వెడ్డింగ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక ముడు సినిమాలు అయిపోయాక పూర్తిగా డైరెక్షన్ వైపు దృష్టి. పెట్టనున్నట్లు సోనమ్ తెలిపింది.