Begin typing your search above and press return to search.

స్టోరీ బిహైండ్ సోన‌మ్ `మెహెందీ` లెహెంగా!

By:  Tupaki Desk   |   8 May 2018 4:12 PM GMT
స్టోరీ బిహైండ్ సోన‌మ్ `మెహెందీ` లెహెంగా!
X
బాలీవుడ్ హీరో అనిల్‌ కపూర్ ముద్దుల కూతురు సోనమ్‌ కపూర్ వివాహం మంగ‌ళ‌వారం నాడు అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో సోన‌మ్ ఏడ‌డుగులు న‌డిచింది. ముంబైలోని బాంద్రాలో అతి త‌క్కువ మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జ‌ర‌గ‌డం విశేషం. క‌పూర్ ఫ్యామిలీస్ తో పాటు, బంధువులు - బాలీవుడ్ ప్రముఖులు - వ్యాపార‌వేత్త‌లు ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. ఈ వివాహ వేడుక మొత్తానికి సోన‌మ్ ధ‌రించిన ఎరుపు రంగు లెహంగా సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. ఎరుపు రంగు లెహెంగా మీద బంగారు రంగు తామరపువ్వులతో వేసిన‌ డిజైన్ అందరి చూపుల‌ను క‌ట్టిప‌డేసింది. అర్జున్‌ కపూర్‌ - అన్షులా - జాహ్నవీ కపూర్‌ - ఖుషీ కపూర్ - బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ - రణ్‌ వీర్‌ సింగ్‌ - రాణీ ముఖర్జీ - కరీనా- సైఫ్‌ అలీఖాన్‌ దంపతులు - కరీష్మా కపూర్‌ - జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ - స్వరా భాస్కర్‌ తదితరులు హాజరై సందడి చేశారు.

ఎరుపు రంగు లెహెంగాలో సోన‌మ్ క‌పూర్....రాకుమారిలా కనిపించింది. పెళ్లికి వ‌చ్చిన వారంతా ఆ లెహెంగాను తెగ పొగిడేశారు. అనురాధా వాకిల్ రూపొందించిన ఆ సంప్ర‌దాయ పెళ్లికూతురుకు ఆహూతులు ఫిదా అయిపోయారు. అయితే, అంత‌కుముందు మెహందీ ఫంక్ష‌న్ కు సోన‌మ్ ధ‌రించిన బంగారు వ‌ర్ణం లెహెంగా వెనుక ఆస‌క్తిక‌ర క‌థ‌నం ఉంది. ఆ లెహెంగాకు అంత అందం రావ‌డం వెనుక డిజైన‌ర్ల క‌ఠోర శ్ర‌మ ఉంది. దాదాపు ఏడాదిన్న‌ర పాటు క‌ష్ట‌ప‌డి రూపొందించారట‌. అబు జానీ - సందీప్ ఖోస్లా అనే డిజైనర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి దానిని డిజైన్ చేశార‌ట‌. దాదాపు రెండు సంవ‌త్స‌రాల కిందే సోన‌మ్ ఆ లెహెంగాకు ఆర్డర్ ఇచ్చింద‌ట‌. ఆ ఇద్ద‌రు డిజైనర్ల‌కు సాయంగా మ‌రికొందరు డిజైన‌ర్లు క‌లిసి ఏడాదిన్న‌ర‌లో దానిని రూపొందించార‌ట‌. పెళ్లిళ్లు - స్పెష‌ల్ అకేష‌న్స్ లో సెల‌బ్రిటీలు త‌మ డ్రెస్ ల విష‌యంలో ఎంత జాగ్ర‌త్త తీసుకుంటారో తెలిసిందే. అయితే, ఫ్యాష‌న్ ప్రియురాలైన సోనమ్ త‌న పెళ్ళికి డిజైన్ చేయించిన లెహెంగా....మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం బీ టౌన్ తో పాటు సోష‌ల్ మీడియాలోనే ఈ లెహెంగా హాట్ టాపిక్ అయింది. భ‌విష్య‌త్తులో సోనమ్ ను ఆద‌ర్శంగా తీసుకొని మ‌రింత‌మంది సెల‌బ్రిటీలు ఈ త‌ర‌హా ట్రెండ్ క్రియేట్ చేస్తారేమో వేచి చూడాలి.


మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి