Begin typing your search above and press return to search.

సోనమ్ అండ్ సిస్టర్ బట్టలు కావాలా??

By:  Tupaki Desk   |   5 May 2017 1:00 PM GMT
సోనమ్ అండ్ సిస్టర్ బట్టలు కావాలా??
X
సెక్సీ హీరోయిన్ సోనమ్ కపూర్ మరియు రియా కపూర్ ల బట్టలు కావాలా? అంత చిలిపిగా ఆలోచించకండి. కేవలం వారు తయారుచేసిన కొత్త బ్రాండ్ బట్టల గురించి చెబుతున్నాం అంతే. అవి కావాలంటే మాత్రం మీరు కాస్త వెయిట్ చేయండి.. త్వరలోనే వచ్చేస్తున్నాయి. మీరు త్వరలోనే ఈ అక్కాచెల్లెళ్ళ బట్టలను కొనుక్కోవచ్చు.

ఎప్పటినుండో డిజైనర్ గా తన సత్తాచాటుతోంది సోనమ్ కపూర్ చెల్లెలు రియా కపూర్. ఆమె డిజైన్ చేసిన బట్టలను.. అలాగే ఇతర బట్టలను చాలా ఫ్యాషన్ గా వేసుకుంటూ ఫ్యాషనిస్టా అనిపించుకుంటోంది సోనమ్. ఇప్పుడు ఈ సెక్సీ ముద్దగుమ్మలు ఇద్దరూ కలసి.. రియా లోని 'రి' సోనమ్ లోని 'సోన్' తీసుకుని.. ''#Rheson'' అంటూ ఒక బ్రాండ్ పెట్టేశారు. త్వరలోనే షాపర్ స్టాప్ లో సోనమ్ అండ్ రియా తయారుచేసిన టీ-షర్టులను మీరు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ సోషల్ మీడియా సాక్షిగా ఈ కొత్త బ్రాండ్ ప్రచారం మొదలెట్టేశారు ఇద్దరూ. యాజూజువల్ గా బాలీవుడ్ లో కంగ్రాట్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సెలబ్రిటీలు.

ఇప్పటికే హృతిక్ రోషన్ వంటి నటులు.. గౌరీ ఖాన్ వంటి స్టార్ వైవ్స్.. తమ సొంత డిజైనర్ బట్టలను తయారుచేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/