Begin typing your search above and press return to search.

రెండో సినిమాకే అంత సాహసమా?

By:  Tupaki Desk   |   26 May 2015 7:30 PM GMT
రెండో సినిమాకే అంత సాహసమా?
X
సోనారిక .. బుల్లితెర నుంచి వెండితెరకి పరిచయం అవుతున్న నవతరం కథానాయిక. ఉత్తరాది నుంచి లక్‌ చెక్‌ చేసుకోవడానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. వస్తూనే రెండు సినిమాల్ని ఖాతాలో వేసుకుంది. ఊహలు గుసగుసలాడే ఫేం నాగశౌర్య సరసన 'జాదూగాడు' చిత్రంలో నాయికగా నటించింది. జూన్‌ 5న ఈ సినిమా రిలీజవుతోంది. ఆ వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన రెండో అవకాశం అందుకుంది. తమిళ సినిమా సుందరపాండియన్‌కి రీమేక్‌ ఇది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే సోనారిక నవతరం అమ్మాయిల్లో కాసింత డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌. రెండో సినిమాతోనే ప్రయోగాలు మొదలుపెట్టింది. డీగ్లామరస్‌ పాత్రలో చేస్తూ సాహసం చేస్తోంది. క్యూట్‌ గ్లామరస్‌ లుక్‌లో కనిపించే ఈ అమ్మడు ఇలా డీగ్లామ్‌ రోల్‌లో ప్రేక్షకుల్ని మెప్పించగలదా? అన్నదే డిష్కసన్‌ పాయింట్‌. ఒక శ్రీదేవి (16ఏళ్ల వయసు)లా, మరో సంగీత (శివపుత్రుడు)లా.. మెప్పించేంత ట్యాలెంటు ఉందా? కాస్త వేచి చూడాల్సిందే. మహదేవ్‌ అనే టీవీ సీరియల్‌లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆలోచనల్లో, నటనలో ఆమాత్రం పరిణతి ఉంటుందనే భావించాలి. రెండో ప్రయత్నమే అంత సాహసానికి ఒడికట్టావ్‌. సోనారిక ఆల్‌ ది బెస్ట్‌ బేబీ..