Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్.. వన్ హార్ట్.. 2 హార్ట్ బీట్స్.. సాంగ్ టీజర్
By: Tupaki Desk | 28 Nov 2021 6:03 AM GMTప్రేమకథా చిత్రాల్లో మరపురాని చిత్రాలు ఎన్నో ఉన్నా.. గొప్ప ఫీల్ ని తెచ్చేవి ఇటీవల అరుదుగానే కనిపిస్తున్నాయి. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు రాధేశ్యామ్ వస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ పీరియడ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించనుంది. సంక్రాంతి 2022 కానుకగా ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 14న మూవీ విడుదలవుతోంది.
తాజాగా రాధేశ్యామ్ కొత్త పోస్టర్ విడుదలైంది. యూరోపియన్ ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబించే అందమైన భవంతిలో ప్రేమికుల విలాపం ఈ పోస్టర్ లో ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రేయసి కళ్లలో భాషల్ని చదివేస్తున్న గొప్ప ప్రేమికుడిగా ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్ కి తగ్గట్టుగానే అతడి ప్రేమలో లీనమైపోయే అందగత్తెగా పూజా అందం అంతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిచ్ యాంబియెన్స్ తో ప్రతి ఫ్రేమ్ రక్తి కట్టించనుందని విడుదలైన ప్రతి పోస్టర్ రివీల్ చేస్తూనే ఉన్నాయి.
ఈ సినిమా నుంచి ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ది లవ్ ఆంథెమ్ ఆఫ్ రాధేశ్యామ్ .. టీజర్ 29 నవంబర్ సాయంత్రం 7గంటలకు తెలుగు-తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందే ఒంటిగంటకు హిందీ టీజర్ విడుదలవుతుందని టీమ్ ప్రకటించింది. సౌత్ కి ఒకరు నార్త్ కి వేరొకరు మ్యూజిక్ అందించడం ఈ సినిమా ప్రత్యేకత.
ప్రేమకథ యూనిక్ స్టైల్లో..
రాధేశ్యామ్ కోసం ప్రభాస్ దాదాపు 11ఏళ్ల తర్వాత ప్రేమికుడిగా మారారు. ఇన్నాళ్లు యాక్షన్ ఎంటర్ టైనర్లతో అలరించిన డార్లింగ్ ఈసారి వీర ప్రేమికుడిగా ప్రజల హృదయాల్ని స్పర్శించనున్నాడు. రాధేశ్యామ్ ప్రేమకథ ఆద్యంతం ట్విస్టులతో రంజింపజేయనుందని సమాచారం. 1970-90 కాలం నాటి లవ్ స్టోరీతో సాగే పీరియాడిక్ చిత్రమిది. చిత్రీకరణ అంతా ఆ కాలానికి సంబంధించిన ప్రత్యేకమైన సెట్లలో సాగింది. అయితే ప్రధానంగా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీ..రోమ్..వెనీస్ వంటి అందమైన నగరాల్లో జరిగింది. ఇంకా ఇండియాలో షూట్ ని ప్రఖ్యాత దేవాలయాల్లో..నాటి హెరిటేజ్ కల్చర్ ని స్ఫురించే అనవాళ్ల మధ్యనే జరిపారు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన లవ్ స్టోరీ కావడంతో యూనిట్ ఆ నగరాల్ని.. ప్రదేశాల్ని టార్గెట్ గా చేసి చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని యూనిట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంతకీ ఇటలీ..రోమ్ లాంటి నగరాల్ని ప్రత్యేకంగా ఎందుకు? టార్గెట్ చేసినట్లు అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. ఇటలీ..రోమ్ వంటి నగరాల్లో ఇప్పటికే 1970-90 కాలం నాటి అనవాళ్లు ఉన్నాయి. ఇటలీ అందాల్ని సాధారణ కెమెరాలో బందీ చేస్తేనే ఎంతో అద్భుతంగా కనిపిస్తాయని సమాచారం.