Begin typing your search above and press return to search.
సాంగ్స్ సూపర్ హిట్..బట్ మూవీస్..!
By: Tupaki Desk | 13 Aug 2022 7:37 AM GMTఈ మధ్య విడుదలైన చాలా సినిమాల్లో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచి నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అంతే కాకుండా సోషల్ మీడియా ఇన్ స్టాలో రీల్స్ గా కూడా వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో 100 మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని రాబట్టి సినిమాలకు మరింత క్రేజ్ ని తీసుకొచ్చాయి. పాటలు నెట్టింట వైరల్ కావడంతో ఏ నోట విన్నా అవే సినిమాలు వార్తల్లో నిలవడం మొదలైంది. కానీ టీజర్, ట్రైలర్ లు మాత్రం ఆ స్థాయిలో బజ్ ని క్రియేట్ చేయలేకపోయాయి.
పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై కలిగించిన ఎగ్జైట్ మెంట్ ని, క్రేజ్ ని క్యారీ చేయలేకపోయాయి. దీంతో ఆ ప్రభావం ఆయా సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడేలా చేశాయి. రీసెంట్ గా విడుదలైన 'ది వారియర్, మాచర్ల నియోజక వర్గం సినిమాలు ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారి మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని రాబట్టి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
దీంతో ఈ మూవీస్ పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ క్రియేట్ అయింది. కానీ అది ట్రైలర్ లు ఆసక్తికరంగా లేకపోవడంతో ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయింది. రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' మూవీ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఎన్. లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ద్వి భాషా చిత్రంగా తెరకెక్కించారు. ఈ మూవీలోని 'బుల్లెట్' సాంగ్ తెలుగుతో పాటు తమిళంలోనూ వైరల్ గా మారింది. 100 మిలియన్ లకు మించి వ్యూస్ ని రాబట్టింది.
సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో తన వంత పాత్ర పోషించింది. అయితే ఆ సాంగ్ ని మించి బజ్ ని క్యారీ చేయడంతో మాత్రం ట్రైలర్స్ , ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దీంతో దాని ప్రభావం ఓపెనింగ్స్ పై చూపించలేకపోయింది.
ఇక ఆగస్టు 12న విడుదలైన నితిన్ మూవీ 'మాచర్ల నియోజక వర్గం' కూడా ఇదే స్థాయిలో బజ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీలో నితిన్, అంజలిపై చిత్రీకరించిన 'రారా రెడ్డి నేను రెడీ' అంటూ సాగే పాట నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయింది.
మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని రాబట్టి ఇన్ స్టా రీల్స్ తో వైరల్ గా మారింది. కానీ ఆ క్రేజ్ ని మూవీ ట్రైలర్, కానీ టీజర్ కానీ క్యారీ చేయలేకపోయింది. దీంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టలేక తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ రెండు సినిమాలకు పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నా సినిమాలు మాత్రం ఆ స్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. ప్రారంభ వసూళ్లని దక్కించుకోవడంతో విఫలమయ్యాయి. పాటలపై చూపించిన శ్రద్ద కంటెంట్ పై కూడా చూపించి వుంటే ఫలితం మరోలా వుండేదని కామెంట్ లు వినిపిస్తుండటం విశేషం.