Begin typing your search above and press return to search.

ప్రేమ గువ్వ‌ల పెళ్లి క‌బురుపై ఆవిడ‌లా..

By:  Tupaki Desk   |   9 May 2019 11:17 AM GMT
ప్రేమ గువ్వ‌ల పెళ్లి క‌బురుపై ఆవిడ‌లా..
X
ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాభ‌ట్ త్వ‌ర‌లో పెళ్లాడేయ‌బోతోందా? ప‌్ర‌స్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇది. ర‌ణ‌బీర్ - ఆలియా జంట ప్రేమ‌వ్య‌వ‌హారం పెళ్లితో క్లైమాక్స్ కు చేర‌బోతోంద‌ని ప్ర‌చారం హోరెత్తిపోతోంది. గ‌త ఏడాది ప్ర‌ఖ్యాత జీక్యూ ఇంట‌ర్వ్యూలో ర‌ణ‌బీర్ ఆలియాతో ప్రేమ వ్య‌వ‌హారాన్ని అధికారికంగానే ప్ర‌క‌టించాడు. దీంతో ఇక ఈ ఏడాది ఈ జంట పెళ్లి అయిపోతుంద‌ని ఉత్త‌రాది మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

తాజాగా ఇటలీ లేక్ కోమోలో అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ త‌రహాలోనే ఈ జంట కూడా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే దీనిపై ఆలియా త‌ల్లి సోనీ రజ్ధానీ కాస్తంత ఘాటుగానే స్పందించారు. అవ‌న్నీ ఎలాంటి ఆధారాలు లేని గాసిప్స్ మాత్ర‌మేనంటూ ర‌జ్ధానీ ఖండించారు. ఒక త‌ల్లిగా.. ఆలియాను త‌న‌కు న‌చ్చిన‌ట్టు జీవించ‌నిస్తాను. తను ఇలాంటి విష‌యాల్లో ఎంతో సున్నితంగా ఉంటుంది.. అంటూ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ``అభిమానులు ఆ ఇద్ద‌రి గురించి అలా మాట్లాడ‌డం స్వీట్ గానే ఉన్నా.. నేను నా కూతురు వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఏదీ మాట్లాడ‌లేను. త‌న‌ని సంతోషంగా ఉంచ‌డ‌మే నా ప‌ని. త‌న‌కు న‌చ్చిన విధంగా జీవించేందుకు నా వంతు స‌హ‌కారం.. ప్రేమ‌.. ఆశీస్సులు ఎప్పుడూ త‌న‌కు ఉంటాయి`` అని సోనీ రజ్ధానీ వ్యాఖ్యానించారు.

ర‌ణ‌బీర్ - ఆలియా ఇద్ద‌రిపై కొన్ని వెబ్ సైట్లు ర‌క‌ర‌కాలుగా రాస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ యూర‌ప్ ట్రిప్ లో ఉన్నార‌ని ప్ర‌చామ‌వుతోంది. అయితే వాస్త‌వంగా ఎవ‌రికి వారు త‌మ సినిమాల‌ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నార‌ని సోని ర‌జ్ధానీ రివీల్ చేశారు. ర‌ణ‌బీర్ కి వ‌రుస‌గా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటితోనే అత‌డు బిజీ. ర‌ణ‌బీర్ - ఆలియా జంట `బ్ర‌హ్మాస్త్ర‌`లో క‌లిసి న‌టించారు. ఆయ‌న్ ముఖ‌ర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక‌వేళ ఆలియాపై ప్ర‌చారం సాగుతున్న‌ట్టే త‌ను పెళ్లి చేసుకునే ఉద్ధేశంలో ఉంటే మాత్రం ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ ప్రాజెక్టుకు బిగ్ పంచ్ ప‌డుతున్న‌ట్టే. మ‌రి ఆలియా నిర్ణ‌యాలు ఎలా ఉన్నాయో ఓపెన్ గా తెలిసేదెలానో!!