Begin typing your search above and press return to search.

కన్నడ మీడియాపై సోనియా అగర్వాల్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   31 Aug 2021 11:00 PM IST
కన్నడ మీడియాపై సోనియా అగర్వాల్ ఆగ్రహం
X
కన్నడ సోషల్ మీడియాపై హీరోయిన్ ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా చూపించిన అత్యుత్సాహం నటి సోనియా అగర్వాల్ కు తలనొప్పిగా మారింది. సోమవారం ఉదయం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కుంభకోణం విషయమై మోడల్, నటి అయిన సోనియా అగర్వాల్, డీజే వచన్ చిన్నప్ప, బిజినెస్ మ్యాన్ భరత్ ఇళ్లను సోదా చేశారు.

అయితే కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫొటో బదులుగా తెలుగు , తమిళ చిత్రాల హీరోయిన్ ‘17జీ బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఫొటోలను వార్తతోపాటు పోస్ట్ చేశారు. కొందరైతే నటి సోనియా అగర్వాల్ డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు రాసుకొచ్చారు.

ఈ వార్త సోనియా అగర్వాల్ కు చేరేసరికి బాగా డ్యామేజ్ జరిగింది. అప్పటికే సోనియా డ్రగ్స్ కేసులో ఇరుక్కుందన్న వార్త వైరల్ అయ్యింది. ఆమె పరువు పోయింది. దీంతో సన్నిహితులంతా ఆమెకు ఫోన్లు చేస్తూ ఆరాతీయడం మొదలుపెట్టారు.

తమిళ చిత్రం ‘గ్రాండ్ మా’ షూటింగ్ నిమిత్తం సోనియా అగర్వాల్ కేరళకు వెళ్లింది. ఆపైన ఆమె దృష్టికి ఈ విషయం రాగానే తీవ్రంగా ఖండించింది. తన గురించి తప్పుగా రాసిన వెబ్ సైట్స్, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని పేర్కొంది.

జర్నలిస్టులు సరైన హోం వర్క్ చేయకుండా తన పరువుకు భంగం కలిగించారంటూ సోనియా అగర్వాల్ వాపోయింది. మీడియా చేసిన పనికి తన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.