Begin typing your search above and press return to search.

విలన్ గా 'బృందావన్ కాలనీ' బేబీ

By:  Tupaki Desk   |   24 Aug 2018 2:30 PM GMT
విలన్ గా బృందావన్ కాలనీ బేబీ
X
ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పటి న్యూజెన్ మూవీస్ లో తల్లిగానో - అత్తగానో - వదినగానో - అక్కగానో రావడానికి అసలేమాత్రం ఇష్టపడడంలేదు. అలాంటి పాత్రలు పోషిస్తే.. తమ గ్లామర్ కు భంగమని ఫీలవడమో లేక నామోషీగా భావించడమో తెలియదు కానీ..కొంచెం పవర్ ఫుల్ పాత్రలనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో '7/G బృందావన్ కోలనీ' చిత్రంతో సౌత్ లో మంచి మార్కులేయించుకున్న అందాల భామ సోనియా అగర్వాల్ ఇప్పుడో తమిళ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

'నీ ప్రేమకై' తెలుగు చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా .. హీరోయిన్ గా తమిళ చిత్రసీమలోనే స్థిరపడింది ఈ పంజాబీ బ్యూటీ. ధనుష్ అన్న సెల్వరాఘవన్ ను ప్రేమించి పెళ్ళిచేసుకొని.. ఆ తర్వాత అతడితో తెగదెంపులు చేసుకున్న ఈ సుందరి.. ప్రస్తుతం పలు మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. మొన్నటికి మొన్న తెలుగులో 'టెంపర్' - నిన్నొచ్చిన 'విన్నర్' చిత్రాల్లో ప్రాధాన్యం కలిగిన పాత్రల్నే పోషించిన సోనియా..తాజాగా 'ఉన్నాల్ ఎన్నాల్' అనే తమిళ సినిమాతో విలన్ గా మారనుంది. తమిళ దర్శకుడు జయకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందట. విలాసాలకు అలవాటు పడిన ఒక స్త్రీ .. తను పనిచేసే కంపెనీ బాస్ నే చంపడానికి స్కెచ్ గీస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమెకు ఓ ఇద్దరు యువకులు అండగా నిలబడతారు. చివరికి ఆ స్త్రీ తన బాస్ ను చంపగలిగిందా లేదా అన్నదే మిగతా కథ. ఇప్పటివరకూ సోనియా అగర్వాల్ సాఫ్ట్ రోల్సే ప్లే చేసింది. అయితే ఈ సినిమాతో ఆమెలోని మరో కోణాన్ని చూస్తారని దర్శకుడు అంటున్నాడు. ఇక ఈ సినిమాలో సోనియా విలన్ గా నటించడానికి కాస్తంత గట్టిగానే పారితోషికం అందుకుంటోందట. మరి ఈ సినిమాతో సోనియా విలనీ ఏ స్థాయిలో రక్తికడుతుందో చూడాలి.