Begin typing your search above and press return to search.

సన్స్ ఆఫ్‌ సర్దార్‌.. శిక్కు వీరుల పోరాటం

By:  Tupaki Desk   |   19 Aug 2015 10:04 AM GMT
సన్స్ ఆఫ్‌ సర్దార్‌.. శిక్కు వీరుల పోరాటం
X
భారతదేశ చరిత్రలో ఒకానొక అపూర్వ ఘట్టం ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. 10వేల మంది ఆప్ఘన్ల కు ఎదురెళ్లి పోరాడి శత్రు సంహారం చేసి, చివరికి యుద్ధంలో వీరమరణం పొందిన 21మంది శిక్కు వీరుల ధీరత్వం చరిత్రలో పుటలు పుటలుగా రాసి ఉంది. ఇన్నేళ్లలో దేశభక్తి కి సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ, ఈ పాయింటు ఆధారంగా ఎవరూ సినిమా తీయలేదు. ఇప్పుడు ఆ ఘట్టాన్ని వెలుగులోకి తెచ్చేందుకు అత్యంత భారీ బడ్జెట్‌ తో అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీసేందుకు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ప్రయత్నం ప్రారంభించారు. ప్రస్తుతం నటిస్తున్న శివాయ జులై 2016లో రిలీజవుతుంది. ఆ తర్వాత ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. 2017లో సినిమాని రిలీజ్‌ చేయాలన్నది ప్లాన్‌. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే ...

ప్రస్తుత పాకిస్తాన్‌ భూభాగం అయిన నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌ సమీపంలో ఖైబర్‌ పక్తుంక్వా అనే ప్రాంతంలోకి ఆఫ్ఘన్లు చొరబడ్డారు. అప్పుడు అక్కడ ఉన్నది కేవలం 21 మంది శిక్కు ఆర్మీ అధికారులు మాత్రమే. అందరూ సర్ధార్‌ లే. దాదాపు 10వేల మంది దూసుకొస్తుంటే ఎదురెళ్లి పోరాడారు. విరోచిత పోరాటంలో చివరికి మరణించారు. వీరితో పాటు ఆ క్యాంప్‌ లో ఉండే కుక్‌ కూడా చివరికి గన్‌ చేపట్టి పోరాడి మరణించాడు. ఈ కథనే 'సన్స్‌ ఆఫ్‌ సర్ధార్‌' పేరు తో తెరకెక్కిస్తున్నారు. ఇది చరిత్రలో గ్రేట్‌ మిలటరీ వార్‌. సెప్టెంబర్‌ 12 న జరిగింది కాబట్టి ఆరోజున 'సరగారి డే' పేరుతో ఇప్పటికీ సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ కార్పొరెట్‌ దిగ్గజాల అలయన్స్‌ తో స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.