Begin typing your search above and press return to search.

కిరాత‌కం అంటే ఇలా కూడా ఉంటుందా సోనూ భాయ్‌?

By:  Tupaki Desk   |   27 April 2022 11:35 AM GMT
కిరాత‌కం అంటే ఇలా కూడా ఉంటుందా సోనూ భాయ్‌?
X
కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో వైవిధ్యం ఉన్న విల‌నీతో మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు మ‌రో వెరైటీ గెట‌ప్ తో అల‌రించ‌బోతున్నాడు. తాజాగా ఆచార్య నుంచి అత‌డి వెర్స‌టైలిటీకి సంబంధించిన లుక్స్ వెబ్ లో హీటెక్కిస్తున్నాయి.

సోనూసూద్ ఆహార్యం నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేలా కొత్త‌గా క‌నిపిస్తోంది ఈ లుక్స్ లో. సిల్కీ మెరూన్ దోతీ డ్రెస్ ని ధ‌రించిన సోనూసూద్ మెడ‌లో రుద్రాక్ష‌తో బ్రాహ్మ‌ణ అవ‌తారంలో క‌నిపిస్తుండ‌డం అది కూడా హార్డ్ హిట్ట‌ర్ మోడ్ లో అత‌డి ఎక్స్ ప్రెష‌న్స్ చూస్తుంటే కిరాత‌కం అంటే ఇలా కూడా ఉంటుందా? అన్నంత రేంజులో క‌నిపిస్తోంది అవ‌తారం.

సోనూని చూడ‌గానే అవ‌తార్ కే పోటీకొస్తున్న అవ‌తారంలా ఉన్నాడు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం నాలుగు వెరైటీ లుక్స్ తో సోనూ ఫోటోగ్రాఫ్స్ వెబ్ ని చుట్టుముట్టేశాయి. అత‌డులో ఒక త‌ర‌హా విల‌నీ.. జులాయిలో ఇంకో త‌ర‌హా.. ఇప్పుడు ఆచార్య‌లో మ‌రో త‌ర‌హా అన్న‌ట్టుగా సోనూసూద్ విల‌క్ష‌ణ‌త క‌ట్టి ప‌డేస్తోంది.

భాయ్ ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ వేళ అంద‌రివాడ‌య్యాడు. సామాజిక సేవ‌లో సోనూసూద్ చొర‌వ‌ను ప్ర‌శంసించ‌ని వారు లేరు. ఆ త‌ర్వాత అత‌డు న‌టించిన భారీ చిత్రం ఆచార్య‌. సోనూ స్ట్రైక్స్ బ్యాక్ అనే రేంజు క్యారెక్ట‌ర్ అత‌డికి ద‌క్కింద‌న‌డానికి ఈ ఫోజులే నిద‌ర్శ‌నం. ఆచార్య చిత్రం 29 ఏప్రిల్ న‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.