Begin typing your search above and press return to search.

​​దేశం కోసం ఉచితంగా పాట పాడాడు

By:  Tupaki Desk   |   29 Jun 2017 9:18 AM GMT
​​దేశం కోసం ఉచితంగా పాట పాడాడు
X
హింది నేటితరం గాయకులలో మొదటివరసలో ఉంటాడు సోను నిగమ్. సింగర్ గా టాప్ లీడ్ కొనసాగిస్తున్న సోను కొన్ని రియాలిటీ షో కి న్యాయనిర్ణేతగా కూడా ఉంటున్నాడు. దేశం కోసం దేశ జవాన్లు కోసం యుద్ధాలు జరిగినప్పుడు మన సంగీత దర్శకులు వాళ్ళ మాతృదేశాభిమానం చాటుకొంటారు. ఏ ఆర్ రహమాన్ ‘వందేమాతరం’ అని దేశం గొప్పతనాన్ని తెలిపేలా ఒక పాటను పాడాడు. ఇప్పుడు సోను నిగమ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఫోర్స్ కోసం ఒక పాటను పాడాడు.

రెండు నిమిషాల నిడివి ఉన్న “హమ్ సర్హద్ కే సేనాని హమ్ సాచ్చే హిందుస్తానీ” అని ఒక పాట ఆలాపించాడు సోను. ITBP పర్సనెల్ సెక్యూరిటి పోలీసు వాళ్ళు సోను నిగమ్ ను ఈ పాట పాడమని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు అంటా, కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పాడి పెట్టాడు అని చెబుతున్నారు. ఈ పాట చాల కాలం కిందట రాసినా ఇప్పుడు మళ్ళీ కొన్ని మార్పులు చేసి పాటను రికార్డు చేశామని చెబుతున్నారు. మిలిటరీ శబ్ధాలు, వాళ్ళ డ్యూటి విశేషాలు, అక్కడ వాళ్ళు దేశం కోసం పడుతున్న యాతన.. సోను నిగమ్ గాత్రం.. అన్నీ కలగొలిపి ఈ పాట మన దేశభక్తిని మళ్ళీ మనకు గుర్తు తెచ్చేలా ఉందిలే.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఫోర్స్ కోసం కొంపోజ్ చేసిన ఈ పాటను నిన్నే విడుదల చేశారు. ఈ ఫోర్స్ మన దేశ యూనియన్ హోం మినిస్ట్రీ అండర్ లో పని చేస్తుంది. 3,488 కి.మీ ఉన్న సినో ఇండియన్ బోర్డర్ను ITBP రక్షణ ఇస్తుంది. 1962 లో చైనా వాళ్ళు చేసిన దురాక్రమణ వలన ఇక్కడ ఈ ఫోర్స్ ని ఏర్పాటు చేసి 9,000 నుండి 18,700 అడుగుల బోర్డర్ను ఏర్పాటు చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/