Begin typing your search above and press return to search.
ఆన్ స్క్రీన్ విలన్ రియల్ లైఫ్ హీరో అయ్యాడు!
By: Tupaki Desk | 12 May 2020 4:15 AM GMTవెండితెరపై క్రూరుడిగా కనిపిస్తాడు. ముఖానికి రంగేసుకుని అఘోరా అయిపోతాడు. బొమ్మాళీ అంటూ వెంటపడి వేధిస్తాడు. కానీ రియల్ లైఫ్ లో ఆయన చేసిన పని చూసాక అసలు ఈయన విలనేంటి అసలు సిసలు రియల్ హీరో అని పొగిడేయకుండా ఉండలేం. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ సమయంలో విలన్ సోనూసూద్ ఏం చేశాడంటే..?
లాక్ డౌన్ వేళ ప్రభుత్వాలే చేయలేని సాయాన్ని మంచి మనసుతో చేసి శహభాష్ అనిపించాడు. రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకు పోయిన వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏకంగా 10 ప్రయివేటు బస్సుల్ని అద్దెకు తీసుకుని తిప్పాడు. అందుకోసం మహారాష్ట్ర- కర్నాటక ప్రభుత్వాల అనుమతుల్ని తీసుకుని క్షేమంగా వారి ఇండ్లకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు.
లాక్ డౌన్ వల్ల వలస కూలీలకు ఎటూ పోలేని పరిస్థితి. తమఇళ్లకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని తిరిగి రావడానికి అనుమతించడం లేదు. ఈ సమయంలో - నటుడు సోను సూద్ ముంబై గుల్బర్గాలో చిక్కుకున్న అనేక మంది కార్మికులను రక్షించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని థానే - కర్ణాటకలోని గుల్బర్గా నుండి వలస వచ్చిన వారిని పంపించడానికి ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకున్నారు. ఈ బస్సులు ప్రారంభమయ్యే ముందు సోనూసూద్ థానే బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. ప్రయాణీకులంతా ఒక గొప్ప సహాయం చేసినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షోభ సమయంలో ప్రతి భారతీయుడు తమ కుటుంబం ప్రియమైనవారితో కలిసి మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడగలగాలనేది సోనూసూద్ సందేశం. ``లాక్ డౌన్ కారణంగా ముంబైలోని రోడ్లు వీధుల్లో పిల్లలు వృద్ధులు బాధపడుతుండటం చూసి నేను పూర్తిగా కదిలిపోయాను. కేవలం రెండు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ కష్టంలో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాను`` అని తెలిపాడు. అతడి ధాతృత్వంపై ప్రజల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఇంతకుముందే పంజాబ్ వైద్యులకు 1500 పిపిఇ కిట్ లను ఏర్పాటు చేసిన అతడు .. ముంబై జుహులోని తన హోటల్ ను కొవిడ్ 19 రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు.. పోలీసు సిబ్బంది.. పారిశుధ్య కార్మికుల కోసం ఇచ్చేశాడు. అందుకే అతడిని రియల్ లైఫ్ హీరో అనేస్తే తప్పేమీ కాదు. ఇక బాలీవుడ్ లో సల్మాన్ - అమీర్ ఖాన్- షారూక్ సైతం కష్ట కాలంలో ఎంతో పెద్ద సేవ చేస్తున్నారు. ఇటు తెలుగు హీరోలు .. తమిళ హీరోలు ఆపన్నహస్తం అందించారు.