Begin typing your search above and press return to search.
సోనూసూద్ పొలిటీషియన్ కహానీ
By: Tupaki Desk | 10 Sep 2018 6:08 AM GMTఅమ్మ బొమ్మాళీ.. హీహీహీ..! అంటూ భీకరమైన కీచకుడి గొంతుతో - మాంత్రికుడి గెటప్ లో సోనూసూద్ విన్యాసాల్ని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. శ్మశానంలో పీనుగుల్ని పీక్కుతునే జటాజూట సాధువు గెటప్ తో మంత్రతంత్ర విద్యలు తెలిసిన కామపిశాచిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక సోషల్ కాన్సెప్టు సినిమాల్లో నాగార్జున - మహేష్ - రవితేజ లాంటి స్టార్లకు బెస్ట్ విలన్ గా నటించి అలరించాడు. సూపర్ - అరుంధతి - దూకుడు - ఆగడు లాంటి చిత్రాల్లో సోనూ నటన మెప్పిస్తుంది. ఇటీవల ప్రభుదేవా- తమన్నా తో కలిసి అభినేత్రి చిత్రంలోనూ నటించాడు. జాకీచాన్ తో కలిసి కుంగు ఫూ యోగా అనే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించి అదరగొట్టేశాడు.
ఓవైపు బాలీవుడ్ లో నటిస్తూనే - మరోవైపు టాలీవుడ్ - కోలీవుడ్ లో భీకరమైన విలన్ వేషాలతో అదరగొట్టేసిన సోనూసూద్ కి అన్నిచోట్లా వీరాభిమానులున్నారు. అందుకే సోనూసూద్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు అంటే అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఇటీవలే కంగన దెబ్బకు మణికర్ణిక ప్రాజెక్టును వదిలేసి పారిపోయాడని చెప్పుకున్నారు. ఈలోగానే మరో వేడెక్కించే అప్ డేట్ సోనూ గురించి వినవచ్చింది.
ప్రస్తుతం సోనూసూద్ చేస్తున్న ఓ తెలుగు సినిమా గురించి ఫిలింనగర్ లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో ఆశ్చర్యపరుస్తున్న బెల్లంకొండ శ్రీను చిత్రంలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడట. సాయి శ్రీనివాస్ - కాజల్ జంటగా తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటించాల్సి ఉందింకా. ఇందులో సోనూ సూద్ క్రూరమైన రాజకీయ నాయకుడిగా విలన్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. కర్రహీరో సినిమాకి ఆ పాత్ర అస్సెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.