Begin typing your search above and press return to search.

ముంబై ట్రాఫిక్...ప్రవీణ్ భాయి పరిచయం!

By:  Tupaki Desk   |   8 Oct 2018 5:02 PM GMT
ముంబై ట్రాఫిక్...ప్రవీణ్ భాయి పరిచయం!
X
ఎప్పుడూ హైదరాబాద్ ట్రాఫిక్ ను తిట్టడమేనా? ఏం మిగతా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఉండదా? బెంగుళూరు.. చెన్నై.. ఢిల్లీ.. ముంబై రోడ్లన్నీ ఫ్రీ గా ఉంటాయా? మీరు నాలుగో గేర్ లో సరిగ్గా నాలుగు నిముషాలు కంటిన్యూగా డ్రైవ్ ఆ సిటీల్లో డ్రైవ్ చెయ్యగలరా? మీరు చెయ్యగలరో లేదో తెలీదు కానీ టాలీవుడ్ అఘోరా సోనూ సూద్ కు ముంబై లో ఉండే ట్రాఫిక్ హీట్ రీసెంట్ గా తగిలింది.

సోను ముంబైలో ఏదో ఒక ఈవెంట్ కు హాజరు కావలసి ఉందట. కానీ తను ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ప్రవీణ్ అనే ముంబైకర్ సోను సూద్ కు తన ప్లాటినా బైక్ ఇచ్చి సోనూ వెళ్ళవలసిన ప్లేస్ కు వెళ్లేందుకు సహాయం చేశాడట. దీంతో సంతోషపడిన సోనూ ట్విట్టర్ ఖాతా ద్వారా "మీ బైకును ఇచ్చి నన్ను సరైన టైమ్ లో నా ఈవెంట్ కు చేరేలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యు ప్రవీణ్ భాయి.. ఒక్కోసారి ముంబై ట్రాఫిక్ ఒక్కోసారి సాటివారికి సహాయం చేసే నీలాంటి మనుషులను పరిచయం చేస్తుంది" అని ట్వీట్ చేసి తనతో దిగిన ఫోటో ను పోస్ట్ చేశాడు.

ముంబై ట్రాఫిక్ ఎలాగూ భరించలేనిదే. సోనూ సూద్ కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ ముంబై ట్రాఫిక్ ను తిట్టకుండా అలాంటి ట్రాఫిక్ వల్లే ప్రవీణ్ భాయి పరిచయం అయ్యాడని చెప్తేనే సోనూ సూద్ ఎంత పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తో మనకు అర్థం అవుతుంది కదా. లేకపోతే బీజేపీ గవర్నెన్స్ ఇలా ఎడ్చిందని .. దేవేంద్ర ఫడ్నవీస్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసి ముంబై లో బతకడం కంటే చావడం మేలని ట్వీట్ చేసి ఉండేవాడు.