Begin typing your search above and press return to search.

జిమ్ బోయ్స్‌ కి 50 సైకిళ్లు గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:36 AM GMT
జిమ్ బోయ్స్‌ కి 50 సైకిళ్లు గిఫ్ట్‌
X
సూప‌ర్ మూవీతో తెలుగులో ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు సోనూ సూద్‌. ఆ త‌ర్వాత పూరి తెర‌కెక్కించిన చాలా సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు. పూరి - త్రివిక్ర‌మ్ సినిమాల్లో విల‌న్‌ గా పాపుల‌ర్ అయ్యాడు. సేమ్ టైమ్ బాలీవుడ్‌ లోనూ ద‌మ్మున్న విల‌న్‌ గా పేరు తెచ్చుకున్నాడు. స‌ల్మాన్‌ ఖాన్ మూవీ ద‌బాంగ్‌ లో విల‌న్‌ గా అద‌ర‌గొట్టేశాడు. అయితే ఆ సినిమాలో స‌ల్మాన్ తో క‌లిసి న‌టించాక సోనూలా చాలానే మార్పులొచ్చాయి. క‌రుడుగ‌ట్టిన విల‌నీలోనూ దాతృత్వం పుట్టుకొచ్చింది. అందుకే ప్ర‌స్తుతం అత‌డు త‌న స్వ‌గ్రామ‌మైన మోఘ వెళ్లాడు. అక్క‌డ త‌న ప‌ర్స‌న‌ల్ జిమ్‌ లో నిత్యం క‌స‌ర‌త్తులు చేస్తున్న 50 మంది జిమ్ బోయ్స్‌ కి సైకిళ్ల‌ను పంచాడు. సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. ఫిట్‌నెస్‌ ని కాపాడుకోండి అంటూ సోనూ సూక్తులు వ‌ల్లించాడు.

అయితే దీనికి ఇన్‌ స్పిరేష‌న్ ఎవ‌రు? అంటే స‌ల్మాన్‌ ఖాన్‌. ద‌బాంగ్ రిలీజ్ టైమ్‌ లో స‌ల్మాన్ కొంద‌రు వీధి బాల‌ల‌కు సైకిళ్లు కొనిచ్చాడు. అది అప్ప‌ట్లో పెద్ద‌గా చ‌ర్చ‌కొచ్చింది. ఇప్పుడు సోనూ సూద్ కూడా త‌న సొంత ఊరిలో ఫిట్‌ నెస్ పై ఆస‌క్తి ఉన్న కుర్రాళ్ల‌ను ఇన్‌ స్ప‌యిర్ చేసేందుకు ఇలా సైకిళ్లు పంచాడు. ఆరోగ్య‌మే మహాభాగ్యం. సైకిళ్లు తొక్కండి. ఫిట్‌గా ఉండండి... అని ప్ర‌చారం చేస్తున్నాడు. ఎక్క‌డికైనా వెళ్లాలంటే టూవీల‌ర్ పైనే వెళుతున్నాం. దానికంటే ఇలా సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల రోగాల‌కు దూరంగా ఉండొచ్చు అని చెబుతున్నాడు. ప్ర‌య‌త్నం బాగానే ఉంది మ‌రి!