Begin typing your search above and press return to search.

నాగ్‌కి సోనూ డిజైనర్‌ స్టయిలింగ్‌

By:  Tupaki Desk   |   25 May 2015 5:30 AM GMT
నాగ్‌కి సోనూ డిజైనర్‌ స్టయిలింగ్‌
X
కింగ్‌ నాగార్జున, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఇద్దరూ చిరకాల మిత్రులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోని సూపర్‌ సినిమాలో నటించారు. అందులో సోనూసూద్‌ నాగార్జునకు ఫ్రెండుగా, రైవల్‌గా నటించాడు. నాటినుంచి ఇద్దరిమధ్యా చక్కని స్నేహం కొనసాగింది. ఇప్పటికీ ఈ ఇద్దరూ ఒకరికొకరు ఫోన్‌లో ముచ్చట్లాడుకుంటారు. ఒకరినొకరు విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకునేంత చనువు. అంతేకాదు నాగార్జునకు అత్యవసరంలో ఆదుకునే స్నేహితుడు కూడా సోనూనే.

ఇటీవల నాగార్జున తనకి ఓ స్టయిలిస్ట్‌ కావాలని సోనూని అడిగాడు. అంతే వెంటనే తన వ్యక్తిగత స్టయిలిష్ట్‌ పునీత్‌ని ముంబై నుంచి పంపించేశాడు. ఆ స్టయిలిస్ట్‌ కింగ్‌ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడులో నాగ్‌ లుక్‌ని డిజైన్‌ చేసింది అతడే. సూటు, బూటు, హెయిర్‌ డిజైన్‌ అంతా అతడు చూసుకున్నదే. అంతేనా ఇప్పుడు నాగ్‌ నటిస్తున్న సినిమాలకు కూడా లుక్‌ డిజైనర్‌ తనే. హెయిర్‌ స్టయిల్‌ నుంచి ప్రతిదీ తనే చూసుకునేది. ఓ మంచి డిజైనర్‌ని పంపించిన స్నేహితుడివి అంటూ నాగ్‌ నుంచి కాంప్లిమెంట్‌ కూడా అందుకున్నాడు సోనూ. అదీ సంగతి.