Begin typing your search above and press return to search.
లేట్ అవ్వొచ్చేమో గానీ.. రావడం మాత్రం పక్కా
By: Tupaki Desk | 3 Sep 2020 12:30 PM GMTలాక్డౌన్ సమయంలో దేశంలోని ప్రజందరి చేత రియల్ హీరో అనిపించుకున్న ప్రముఖ నటుడు సోనూ సుద్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ‘మీరు రాజకీయాల్లోకి రండి.. పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడిస్తున్నారు. ' అంటూ పలువురు నన్ను సోషల్‌మీడియాలో అడుగుతున్నారు. వారందరికీ ఇదివరకు ఓ సారి సమాధానం చెప్పాను. కానీ అభిమానుల ఒత్తిడితో మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. 'నేను ప్రస్తుతం ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను. నాకు తోచినమేర సాయం చేస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే ఆ పరిస్థితి ఉంటుందో లేదో చెప్పలేను. బహుశా రాజకీయాల్లోకి వస్తే ఇంతకంటే మెరుగ్గానే సేవలు చేస్తానేమో తెలియదు. కానీ నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానో ప్రస్తుతం అయితే చెప్పలేను’ అంటూ వ్యాఖ్యానించారు.
సోనూసుద్.. రియల్‌హీరో. బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, కోలివుడ్, ఇతరభాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన నటుడి కంటే గొప్ప మానవతావాదిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన పేదప్రజలకు, కూలీలకు అందించిన సహాయంపై దేశవ్యాప్త చర్చజరిగింది. సోనూసుద్ రియల్ హీరో అంటూ సోషల్‌మీడియాలో ఏ రేంజ్లో ప్రశంసలు దక్కాయి.
పేదల కళ్లల్లో ఆనందం నింపాడు
లాక్‌డౌన్‌తో ఎందరో కూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో మిగతా హీరోలలాగా ప్రేక్షకపాత్ర పోషించకుండా తన వంతు సాయం చేశాడు. అందుబాటులో ఉన్నవాళ్లందరిని తమ సొంత ఊళ్లకు చేర్పించి వాళ్ల అభిమానాన్ని చూరగొన్నాడు.
నాకూ ఇష్టమే
‘రాజకీయాల్లోకి రావాలని నా శ్రేయోభిలాషులు, అభిమానులు కోరుతున్నారు. అయితే రాజకీయాల్లోకి రావడంపై నాకు ఆసక్తి ఉన్నమాట వాస్తవమే. అయితే ఎప్పుడ వస్తానో మాత్రం కచ్చితంగా చెప్పలేను కానీ తప్పకుండా ప్రజాజీవితంలోకి వస్తా. భవిష్యత్తులో గనక రాజకీయాల్లోకి వస్తే వంద శాతం ప్రతి ఒక్కరికి సహాయం చేసే బాధ్యత బలం నాకు ఉంటుంది. ప్రజల సమస్యలను ఈజీగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి నేను ఏ మాత్రం సిద్ధంగా లేను. ఇక ఇప్పుడైతే స్వచ్ఛంగా స్వేచ్ఛగా నేను అనుకున్న పనులు చేస్తున్నా. నేను సినిమా రంగంలో ఇంకా కొంత కాలం పాటు కొనసాగాలని అనుకుంటున్నా. ఏదైనా ప్రజలకు సేవాచేయాలని అనుకుంటున్నా' అంటూ సోనూసుద్ సుధీర్ఘ వివరణ ఇచ్చారు.