Begin typing your search above and press return to search.
4 కాళ్లు 4 చేతుల చిన్నారికి సోనూసూద్ సాయం
By: Tupaki Desk | 10 Jun 2022 4:35 PM GMTసోనూ సూద్ మరోసారి మెస్సయ అని నిరూపించాడు. కరోనావైరస్ మహమ్మారి కాలంలో దయగల హృదయంతో సోనూ సిసలైన దేవుని బిడ్డే అయ్యాడు. ప్రజల్లో అతడంటే ఒక విశ్వాసం. అతడి దానగుణానికి హద్దులే లేవని మంచి పేరొచ్చింది. కరోనా లాక్ డౌన్ లో వలసదారులను గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు సహాయం చేసిన అతడు.. బలహీనవర్గాలకు ఆహారం మందులు అందించారు.
లాక్ డౌన్ ఆద్యంతం కరోనాలో తన సహాయం అవసరమైన వారందరికీ అండగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురిని ఆపదలో ఆదుకున్నాడు. సోనూ భాయ్ ఇప్పటికీ తన సేవల్ని కొనసాగిస్తున్నాడు. తనకు బంగారు హృదయం ఉందని మరోసారి నిరూపించుకున్నాడు. ఈసారి అతను బీహార్ లోని ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని తీసుకురావడానికి సహాయం చేశాడు. నాలుగు కాళ్లు నాలుగు చేతులతో పుట్టి జీవనంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఓ చిన్నారి సర్జరీకి అతడు సహాయం చేసాడు.
సోనూ సూద్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన శరీరంలో నాలుగు కాళ్లు నాలుగు చేతులతో జన్మించిన చౌముఖి అనే చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని తాజాగా సోనూసూద్ తెలిపాడు. సదరు చిన్నారి కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉందని సోనూ తెలిపాడు. శస్త్ర చికిత్స చేయించుకునే స్తోమత లేని ఆమె తల్లితండ్రులకు చికిత్సను స్పాన్సర్ చేసారు. చిన్నారి కి బాగు అయిన తర్వాత.. అంతకుముందు పరిస్థితికి సంబంధించిన ఫోటోలను అతడు షేర్ చేసాడు. చౌముఖి బీహార్ లోని ఒక చిన్న గ్రామంలో నాలుగు కాళ్లు నాలుగు చేతులతో జన్మించింది. ఇప్పుడు చికిత్స అనంతరం అందరిలానే నడవగలదు.. చేతులను ఉపయోగించగలదు. దీనికి సహకరించిన సోనూసూద్ మళ్లీ దేవుడయ్యాడు. అతడి ధాతృత్వానికి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ పోస్ట్ ని షేర్ చేయగానే.. సోనూ పరిశ్రమ స్నేహితులు అభిమానుల నుండి గొప్ప ప్రేమ కురిసింది. సునీల్ శెట్టి- ఈషా గుప్తా- రిధిమా పండిట్ సహా సహ నటీనటులు కామెంట్ సెక్షన్ లో హార్ట్ ఎమోజీలతో ప్రశంసించారు. పూజా బాత్రా కూడా చాలా అద్భుతం అని రాశారు. ఓనూ అభిమానులలో ఒకరు `భూమిపై ఉత్తమ వ్యక్తి` అని రాశారు. మరొకరు బాలీవుడ్ లో మీరు ఉత్తముడు అని వ్యాఖ్యానించారు. వేరొకరు `గరీబో కా మెస్సియా` అని వ్యాఖ్యానించారు. సోనూసూద్ టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్. అంతకుమించి మానవతను చాటుకుంటూ అందరివాడు అయ్యాడు.