Begin typing your search above and press return to search.

నిర్మాతగా అరుంధతి విలన్ కబుర్లు

By:  Tupaki Desk   |   14 Oct 2016 10:30 PM GMT
నిర్మాతగా అరుంధతి విలన్ కబుర్లు
X
అరుంధతిలో పసుపతిగా సోనూ సూద్ తప్ప వేరే ఆర్టిస్ట్ ను ఊహించుకోవడం కూడా కష్టం. అంతగా తను చేసే పాత్రలను మెప్పించేసేందుకు సోనూ సూద్ చాలానే కష్టపడతాడు. దేశవ్యాప్తంగా ఐదారు భాషల్లో ఇప్పటికే 60కి పైగా సినిమాల్లో చేసిన ఈ విలన్ కం కేరక్టర్ ఆర్టిస్ట్.. తాజాగా నిర్మాతగా కూడా మారిపోయాడు. అభినేత్రి హిందీ వెర్షన్ టూటక్ టూటక్ టూటియాతో ప్రొడ్యూసర్ గా కూడా మారాడు సోనూ సూద్.

చిన్నప్పటి నుంచి సినిమాలపై మోజు ఉండగా.. ఫిలింసిటీలో అడుగు పెడితే తన ఫిజిక్ ని చూసి వెంటబడి ఛాన్సులు ఇస్తారని అనుకునేవాడట. కానీ ఎంతో కష్టపడితే గానీ ఈ స్థాయికి అందుకోలేదని.. ఇందుకోసం 14 ఏళ్లపాటు శ్రమించానని చెబుతున్నాడు సోనూ సూద్. సినిమా ఇండస్ట్రీ అంటే చెడు అలవాట్లు అని అంతా అనుకుంటారని.. కానీ తనకు మందు సిగరెట్ అలవాట్లు కూడా లేవంటూ చిన్నపాటి షాక్ నే ఇచ్చాడు సోనూ సూద్. తాను ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా.. దక్షిణాదికే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెబుతున్నాడు. ఇందుకు కారణం.. ఇతగాడికి లైఫ్ వచ్చింది ఇక్కడే.

సూపర్ మూవీతో సోనూ సూద్ పేరు మార్మోగిపోగా.. ఆ తర్వాత అరుంధతితో ఎన్నో మెట్లెక్కేశాడు. ఆ తర్వాతే జోధా అక్బర్ లో చేసే ఛాన్స్ వచ్చింది. తను ఇప్పుడు నిర్మాతగా కూడా మారి ఈ రేంజ్ లో ఉండడానికి ఎంతో మంది సపోర్ట్ చేశారని చెబుతున్నాడు సోనూ సూద్. యాక్సిడెంట్ అయి అడ్వాన్సులు వెనక్కిచ్చేస్తానని చెప్పినపుడు.. ఆ పాత్రలు నీ కోసమే రూపొందించామని చెప్పి.., రెండు నెలలకు పైగా వెయిటింగ్ చేశారట.