Begin typing your search above and press return to search.
కొవిడ్ వ్యాక్సిన్ పై సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 7 April 2021 10:30 AM GMTదాదాపు 130 కోట్ల మంది ఉన్న దేశంలో.. ఇప్పటి వరకూ ఇరవై శాతం మంది కూడా వ్యాక్సిన్ తీసుకోలేదని సమాచారం. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగడానికి జనాల్లో ఉన్న భయం కూడా ఒక కారణమనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. వ్యాక్సిన్ వందశాతం సురక్షితమని చెప్పే రుజువులు లేకపోవడం.. పలువురు ప్రాణాలు కోల్పోవడంతో జనాల్లో భయం పెరిగిపోయింది. దీంతో.. చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.
ఇప్పడు సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. దేశంలో వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. దీంతో.. ఈ డ్రైవ్ లో తాను సైతం భాగం అవుతానని వచ్చేశారు సోనూ సూద్. ఈ మేరకు పంజాబ్ లోని అమృత్ సర్ లో ‘సంజీవని’ పేరుతో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఇందులో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న సోనూ.. ప్రజలకు పిలుపునిచ్చారు.
కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా అని ఆలోచిస్తున్నారని సోనూ సూద్ చెప్పారు. దీనిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. మనతోపాటు అందరి ఆరోగ్యం కాపాడేందుకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్లో పాల్గొనాలని సూచించారు.