Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి చేతుల మీదుగా సోనూసూద్‌ ఆక్సీజన్ ప్లాంట్ ప్రారంభం

By:  Tupaki Desk   |   24 July 2021 6:13 AM GMT
ఏపీ మంత్రి చేతుల మీదుగా సోనూసూద్‌ ఆక్సీజన్ ప్లాంట్ ప్రారంభం
X
కరోనా సెకండ్‌ సమయంలో ఆక్సీజన్‌ అందక చాలా మంది మృతి చెందిన విషయం అందరికి తెల్సిందే. ఆ సమయంలో విదేశాల నుండి ఆక్సీజన్ ను తెప్పించి మరీ సోనూసద్‌ ఫౌండేషన్ కరోనా పేషంట్స్ కు అందించి ఎన్నో వందల మంది ప్రాణాలను కాపాడటం జరిగింది. కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆక్సీజన్ కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు భవిష్యత్తు అవసరాలను దృష్టి లో పెట్టుకుని సోనూసూద్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆక్సీజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సీజన్‌ సమస్య మళ్లీ ఎప్పుడు రావద్దనే ఉద్దేశ్యంతో సోనూసూద్‌ చేపట్టిన ఈ కార్యక్రమంను అంతా అభినందిస్తున్నారు.

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూర్‌ లో సోనూసూద్‌ ఆక్సీజన్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. అన్నట్లుగానే కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఆక్సీజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా చేయించారు. తన నియోజక వర్గంలో ఈ ఆక్సీజన్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటూ ఆయన పేర్కొన్నాడు.

రాబోయే రెండు నెలల్లో సోనూసూద్‌ ను నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సిందిగా కోరుతున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మంత్రి ప్రశంసించారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ ముందు ముందు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఇక సోనూసూద్‌ ఒక వైపు సినిమాల్లో బిజీ బిజీగా నటిస్తూనే మరో వైపు తన ఫౌండేషన్‌ తరపున కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఛారిటీ నిర్వహిస్తున్నారు. కరోనా బాధితులను మాత్రమే కాకుండా సాయం అన్న ప్రతి ఒక్కరికి కూడా సోనూ సూద్‌ సాయంగా నిలుస్తున్నారు.