Begin typing your search above and press return to search.
అక్షయ్ ని వదిలేసి సోనూ సూద్ కి పాలాభిషేకం
By: Tupaki Desk | 4 Jun 2022 1:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని మించి సోనూ సూద్ గౌరవం అందుకుంటున్నాడా? అంటే అవుననేందుకు ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. కరోనా క్రైసిస్ లో ప్రజలను ఆదుకుని దేవుడే అయిన సోనూసూద్ కి నిత్యం క్షీరాభిషేకాలు చేసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంలో అతడి నటనను ప్రశంసిస్తూ పాలాభిషేకం చేయడం సంచలనమైంది.
సోనూ సూద్ ఈ చిత్రంలో చాంద్ బర్దాయి అనే బ్రాహ్మణుడి పాత్రను పోషించారు. ఈ పాత్రకు చక్కని స్పందన దక్కింది. ఈ పాత్రలో నటించడం గౌరవంగా ఉందని.. సామ్రాట్ పృథ్వీరాజ్ లో తన నటనను చూసి భారతదేశ ప్రజలు గర్వపడతున్నారని సోనూ సూద్ అన్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ఈ చిత్రం చరిత్ర నేపథ్యంలో రూపొందింది. భయం అంటే ఏమిటో తెలియని శక్తివంతమైన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం అతడి పరాక్రమం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. క్రూరుడైన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యసాహసాలతో పోరాడిన యోధుని గా అక్షయ్ నటించగా సోను సూద్ 'చాంద్ బర్దాయి' పాత్రను పోషించారు.
ఈ రెండు పాత్రలకు చక్కని పేరొచ్చింది. సోనూ నటనకు అతడి భారీ కటౌట్ ని సిద్ధం చేసి దానికి అభిమానులు పాలాభిషేకం చేసారు. అతడిపై పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక పృథ్వీరాజ్ లో సోనూ నటనకు క్రిటిక్స్ సహా కామన్ జనాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ సినిమాలో సోల్ మిస్సయ్యిందన్న విమర్శలు మరోవైపు వెల్లువెత్తాయి. సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ బెస్ట్ ఫ్రెండ్ చాంద్ బర్దాయి పాత్రలో సోనూసూద్ నటించాడు. చాంద్ శక్తివంతమైన రాజు పృథ్వీరాజ్ కి సన్నిహితుడు అలాగే ఆస్థాన కవి కూడా. సోనూ తన పాత్ర గురించి ఇతర ఆసక్తుల గురించి మాట్లాడుతూ-"మన (భారతదేశ) చరిత్రకు సంబంధించిన కీలక పాత్రలను పోషించాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో చాంద్ బర్దాయి పాత్రను పోషించడం నాకు దక్కిన గౌరవం. కొన్నిసార్లు నటీనటులుగా చరిత్రను పునరుద్ధరించే పాత్రల్లో చేయాలి. చరిత్రకారుల జీవితాన్ని గౌరవప్రదంగా ఆవిష్కరించి తరాలను ప్రేరేపించే పాత్రలను పోషించే అవకాశం అరుదు" అని అన్నారు.
"గౌరవం.. స్నేహం.. ప్రతిభ ..త్యాగం విషయంలో చాంద్ బర్దాయి ఒక ఉదాహరణ. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అద్భుతమైన జీవితంపై సినిమాలో అద్భుత పాత్రతో ప్రజలను గర్వించేలా చేసానని ఆశిస్తున్నాను. ఈ చిత్రం మన దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం తీసినది" అని అన్నారు. మూవీ రిలీజై మిక్స్ డ్ టాక్ వైరల్ అయ్యింది. అయినా సోనూకు భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉందని తాజాగా అతడి పాలాభిషేకం వెల్లడిస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్‌కి డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 3న పలు భాషల్లో విడుదలైంది.