Begin typing your search above and press return to search.
ఇండియాపై తీసిన చైనీస్ సినిమా
By: Tupaki Desk | 12 Nov 2016 7:30 AM GMTఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచిన చైనా సినిమా 'జాన్ జాంగ్'. ఇది చైనీస్ మూవీనే అయినా.. దాదాపుగా ఇండియా నేపథ్యంతోనే సాగుతుంది. గతంలో రెండు సార్లు ఆస్కార్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన చైనీస్ సినిమా లోకం.. ఇప్పుడు జాన్ జాంగ్ తో ఆస్కార్ దక్కుతుందని ఆశలు పెట్టుకుంది. చైనా లాంటి దేశం ఇండియా నేపథ్యంతో సినిమాతో ఆస్కార్ దక్కించుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యమే అయినా.. ఈ మూవీ స్టోరీ అలా ఉంటుంది.
ఏడో శతాబ్దానికి చెందిన జాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి జీవితమే ఈ మూవీ. టాంగులు చైనాను ఏలుతున్న కాలంలో.. కన్ఫ్యూషియస్ మతం విస్తృతంగా ఉన్న తరుణంలో.. బౌద్ధానికి సంబంధించి మరింతగా రీసెర్చ్ చేసేందుకు ఇండియా వచ్చిన సన్యాసి జాన్ జాంగ్. 17 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన ఈయన. 16 ఏళ్ల పాటు ఇండియాలోనే ఉండి.. బౌద్ధమతం గురించి తెలుసుకుని.. తర్వాత చైనా భాషలోకి అనువదిస్తాడు. ఎన్నో కీలక పదవులు కాలి దగ్గరకు వచ్చినా.. బౌద్ధానికే జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జాన్ జాంగ్.
హర్షవర్ధనుడుగా సోనూ సూద్ నటించగా.. నేహాశర్మ.. మందనా కరిమి సహా 15మంది ఇండియన్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. మన దేశంలోనూ అజంతా.. ఎల్లోరా.. నలంద సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. జాన్ జాంగ్ ను ఆస్కార్ బరిలో నిలపడంలో చైనా ప్రభుత్వం చొరవ తీసుకోగా.. అప్పట్లో అమితాబ్ ను ఓ కీలక పాత్రలో నటింపచేసేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/