Begin typing your search above and press return to search.

అరుంధతి విలన్ కు అలా సెట్టయ్యింది

By:  Tupaki Desk   |   7 March 2018 4:15 AM GMT
అరుంధతి విలన్ కు అలా సెట్టయ్యింది
X
అరుంధతి సినిమాలో వదల బొమ్మాళి అంటూ కరడు గట్టిన విలన్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించాడు సోనూ సూద్. హీరోలకేం తీసిపోని రీతిలో ఫిజిక్ మెయిన్ టెయిన్ చేసే సోనూకు ఈమధ్య కాలంలో విలన్ గా ఛాన్సులేమీ పెద్దగా రావడం లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్.. బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం సోనూను డిఫరెంట్ రోల్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఆమధ్య జాకీచాన్ తో కలిసి కుంగ్ ఫూ యోగా అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు సోనూ సూద్. ఆ తరవాత అభినేత్రి సినిమాలోనూ ఓ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాడు. ప్రస్తుతం విలన్ రోల్స్ మిస్సయినా.. నటుడిగా నిరూపించుకునే అవకాశాలు వస్తుండటంతో తెగ ఆనందపడిపోతున్నాడు. ఎప్పటి నుంచో ఒక్క సినిమాలోనైనా సైనికుడి పాత్ర చేయాలని కోరుకుంటున్న కోరుకుంటూ ఉండేవాడు. యుద్ధం నేపథ్యంలో చక్కటి దేశభక్తి సినిమాలు తీసే జె.పి.దత్తా డైరెక్ట్ చేస్తున్న పల్టాన్ సినిమా లో సైనికుడి పాత్ర దక్కింది.

దీంతో పాటు కంగన రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న చారిత్రక చిత్రం మణికర్ణిక : ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ - కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం కురుక్షేత్ర లోనూ సోనూ సూద్ నటిస్తున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు జీవిత గాథతో తెరకెక్కే సినిమాలోనూ ఓ ప్రత్యేకమైన రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ నటనకు ప్రాధాన్యం ఉన్నవే కావడం అసలు విశేషం.