Begin typing your search above and press return to search.
సోనూసూద్ మిస్టర్ తెలంగాణ సుశీల్ పాలిట దేవుడే
By: Tupaki Desk | 17 Jun 2022 4:29 AM GMTకరోనా సోకి మరణం అంచు వరకూ వెళ్లిన వాళ్లెందరో. సోనూ సూద్ లాంటి కొందరి ధాతృత్వ సాయం వల్ల బతికి బట్టగలిగిన వాళ్లు ఉన్నారు. అదే కోవలో సోనూ సూద్ సాయంతోనే హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల బాడీబిల్డర్ సుశీల్ గైక్వాడ్ బతికి బట్టగట్టగలిగారు. అతడి జీవితానికి సోనూ రక్షకుడిగా మారాడు. గైక్వాడ్ ఇప్పటికీ కోవిడ్-19తో బాధపడుతున్నాడు. 29 ఏప్రిల్ 2021 నుండి ప్రాణాంతక వైరస్ తో పోరాడుతున్నాడు. సుశీల్ పరిస్థితి విషమంగా ఉందని సోనూకు తెలిసిన వెంటనే అతను కుటుంబ సభ్యులతో వీడియో కాల్ చేసి అందుకుంటానని వారికి హామీ ఇచ్చాడు. అతన్ని పెద్ద ఆసుపత్రికి తరలించారు.
కొన్ని గంటల్లోనే సోనూసూద్ అతని బృందం సుశీల్ ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగలిగారు. అతడిని వెంటిలేటర్ బెడ్ పై నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చాలా రోజుల పోరాటం తర్వాత సుశీల్ ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. అతను ఇప్పుడు చాలా కోలుకున్నాడు. ఇంకా చికిత్సతో మెరుగవుతున్నాడు. అయితే సోనూ సూద్ అతనిని వ్యక్తిగతంగా సందర్శించలేకపోయాడు. కానీ అతను ప్రతిరోజూ సుశీల్ కి వీడియో కాల్ చేస్తూ పరామర్శించాడు. సోను సుశీల్ కి పెద్ద అన్నయ్యలా మారిపోయాడు. అతనిని అంత బాగా చూసుకున్నాడు. సుశీల్ ఒక పోరాట యోధుడు. పూర్తిగా కోలుకున్న తర్వాత త్వరలో ఆసుపత్రి నుండి బయటకు వస్తాడు. సోనూ త్వరలో వెళ్లి సుశీల్ ని కలుస్తానని హామీ ఇచ్చాడు.
కరోనావైరస్ మహమ్మారి కాలంలో దయగల హృదయంతో సోనూ సిసలైన దేవుని బిడ్డే అయ్యాడు. ప్రజల్లో అతడంటే ఒక విశ్వాసం. అతడి దానగుణానికి హద్దులే లేవని మంచి పేరొచ్చింది.
కరోనా లాక్ డౌన్ లో వలసదారులను గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు సహాయం చేసిన అతడు.. బలహీనవర్గాలకు ఆహారం మందులు అందించారు. లాక్ డౌన్ ఆద్యంతం కరోనాలో తన సహాయం అవసరమైన వారందరికీ అండగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురిని ఆపదలో ఆదుకున్నాడు.
సోనూ భాయ్ ఇప్పటికీ తన సేవల్ని కొనసాగిస్తున్నాడు. తెలంగాణ బాడీబిల్డర్ కి నాడు సాయపడిన సోనూ ఇటీవల బీహార్ లోని ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని తీసుకురావడానికి సహాయం చేశాడు.
నాలుగు కాళ్లు నాలుగు చేతులతో పుట్టి జీవనంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న చిన్నారి సర్జరీకి అతడు సహాయం చేసాడు. తన శరీరంలో నాలుగు కాళ్లు నాలుగు చేతులతో జన్మించిన చౌముఖి అనే చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసేందుకు సాయపడ్డాడు.
ఇప్పుడు చికిత్స అనంతరం చంద్రముఖి అందరిలానే నడవగలదు.. చేతులను ఉపయోగించగలదు. సోనూ ధాతృత్వానికి నెటిజనులు ప్రశంసలు కురిసాయి. సోనూసూద్ టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్.
కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులకు సాయం చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో అతడు ఆర్థిక సాయం చేసాడు. అంతకుమించి దేశవ్యాప్తంగా కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటూ.. మానవతను చాటుకుంటూ అందరివాడు అయ్యాడు.