Begin typing your search above and press return to search.
అందరినీ చల్లగా చూడమ్మా.. దుర్గమ్మను దర్శించుకున్న నటుడు సోనూ సూద్
By: Tupaki Desk | 9 Sep 2021 11:05 AM GMTకరోనా లాక్ డౌన్ వేళ అందరికీ రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఏపీలో సందడి చేశారు. ఆధ్యాత్మికంలో మునిగితేలారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో పూజలు చేశారు. దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
సోనూసూద్ ను దుర్గమ్మ ఆలయ అర్చకులు ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదంను అందజేశారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించాని సోనూసూద్ తెలిపారు.
సోనూ సూద్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కోరుకున్నానని సోనూ సూద్ తెలిపారు.
ఇక అంతకుముందు విజయవాడ నగరంలో సోనూసూద్ ‘అంకుర ఆస్పత్రి’ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకుర హాస్పిటల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను రియల్ హీరో కాదని.. నిజ జీవితంలో సామాన్యులే రియల్ హీరోస్ అని కొనియాడారు.
సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం అందించాలని అనుకుంటే అందించవచ్చని తెలిపారు. అంకుర హాస్పిటల్ ద్వారా పేదలకు, సామాన్యులకు వైద్య సేవలు అందుతాయని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానని పేర్కొన్నారు.