Begin typing your search above and press return to search.

ఆపద కాలంలో మరో మంచి పని మొదలు పెట్టిన సోనూసూద్‌

By:  Tupaki Desk   |   28 April 2021 8:30 AM GMT
ఆపద కాలంలో మరో మంచి పని మొదలు పెట్టిన సోనూసూద్‌
X
గత ఏడాది కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో సోనూసూద్‌ కొన్ని వేల మందికి సాయంగా నిలిచాడు. రోడ్డున పడి నడుస్తూ వెళ్లవల్సిన వారిని తన ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి మరీ గమ్యస్థానంకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగించాడు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకున్నాడు.. ఆర్థిక కష్టాలతో పోరాడుతున్న విద్యార్థులకు చేయూత నిచ్చాడు.. రైతులకు అండగా నిలిచాడు. ఇలా ఎన్నో విధాలుగా తనవంతు సాయం చేస్తూ అందరికి ఆపన్న హస్తం అందిస్తున్న సోనూసూద్ మరోసారి మంచి మనసుతో కరోనా రోగులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు.

కరోనా అనుమానం ఉన్నా ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ కు కాల్‌ చేస్తే వెంటనే పరీక్ష ను ఫ్రీగా చేస్తారు. కరోనా పాజిటివ్‌ అని తెలిస్తే వెంటనే మెడిసిన్ ఇవ్వడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వేసుకోవాల్సిన మందుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఈ సర్వీస్ ను ప్రైవేట్‌ ఆసుపత్రుల వైధ్యులతో కలిసి సోనూసూద్‌ ప్రారంభించాడు. ప్రస్తుత సమయంలో కరోనా నిర్థారణ పరీక్ష కు వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది.

పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్‌ లు మరియు ఏమాత్రం సామాజిక దూరం పాటించని జనాలు ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఇంటి వద్ద సోనూసూద్‌ కరోనా నిర్థారణ పరీక్షలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. మీరు విశ్రాంతి తీసుకోండి.. మేము టెస్ట్‌ తీసుకుంటాం అంటూ సోనూ సూద్‌ ఈ కార్యక్రమంను మొదలు పెట్టాడు. కరోనా సెకండ్ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగడం పట్ల జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.