Begin typing your search above and press return to search.

దేవుడికి కృతజ్ఞతలు.. వలస కార్మికుల పై ఓ పుస్తకం రాస్తాను: సోనూసూద్

By:  Tupaki Desk   |   15 July 2020 7:50 AM GMT
దేవుడికి కృతజ్ఞతలు.. వలస కార్మికుల పై ఓ పుస్తకం రాస్తాను: సోనూసూద్
X
సినీనటుడు సోనూసూద్ అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి, కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి వలస కార్మికులకు, పేదలందరికీ ఉచితంగా ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ ను పొడిగించినా పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని చెబుతున్నాడు. సోనూసూద్ మంచి మనసుతో చేసిన పని ఇది. వలస కార్మికుల కష్టాలు ఎరిగిన మనిషి.

ఈ నేపథ్యంలో ఉపాధి లేక చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించాడు. "ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు తమ కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే దేనితోనైనా పోరాడగలడనేది ఆయన నమ్మకం" అంటూ ఆశించాడు.

'పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం తరుక్కుపోయింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఓ సందర్భంలో సోనూసూద్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఛారిటీ సహాయంతో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరినట్లు తెలుస్తుంది. "కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకు బాట చూపించింది" అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనియాడాయి.

అయితే తాజాగా సోనూసూద్.. వలస కార్మికులతో తన అనుభవాలను ఓ పుస్తకంగా మలచాలని.. తానే స్వయంగా లాక్ డౌన్ సమయంలో కార్మికులతో గంటలుగంటలుగా గడిపిన ఆ క్షణాలను.. వారు బస్సు ఎక్కి సొంతింటికి వెళ్తున్నామని ఆనందంతో చూసిన ఆ చూపులు.. అన్నీ నా మనసు నింపేసాయి. ఈ మూడున్నర నెలల సమయం నా జీవితంలో ఎన్నో అనుభవాలను మిగిల్చింది. వలస కార్మికులకు సహాయం చేసే అవకాశం ఇచ్చిన ఆ దేవుడుకి నా కృతజ్ఞతలు. వలస కార్మికులతో నా అనుభవాలను కథలుగా ఓ పుస్తకం రాస్తాను. ఆ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందని సోనూసూద్ వెల్లడించాడు.