Begin typing your search above and press return to search.
'భారతి' ఇకలేదు.. సోనూ సూద్ కంటతడి!
By: Tupaki Desk | 8 May 2021 8:30 AM GMTనాగ్ పూర్ లో కరోనా సోకి.. 85 శాతం ఊపిరితిత్తులు పాడైపోయిన భారతి అనే యువతిని సోనూ సూద్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతి.. ఇవాళ కన్ను మూసిందట. ఈ విషయాన్ని స్వయంగా సోనూ సూద్ వెల్లడించారు.
నాగ్ పూర్ లోని వోకో హార్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతి లంగ్స్ చాలా వరకు దెబ్బతిన్నాయని, హైదరాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్యం అందిస్తేనే.. బతికే ఛాన్స్ ఉందని నాగ్ పూర్ డాక్టర్లు చెప్పారు. కేవలం పాతి సంవత్సరాల వయసున్న అమ్మాయి కొవిడ్ తో చనిపోవద్దని భావించిన సోనూ.. ఆమె కోసం ప్రత్యేకంగా విమానాన్ని బుక్ చేశారు.
ఆ విధంగా హైదరాబాద్ వచ్చిన భారతి రెండు వారాలుగా చికిత్స తీసుకుంటోంది. అయితే.. జాయిన్ చేసుకునేప్పుడే వైద్యులు 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారట. చివరకు అనుమానించినట్టుగానే భారతి కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు సోనూ. 'భారతి అనే అమ్మాయి ఇక లేదు' అని ట్వీట్ చేశారు. నెలరోజులపాటు కొవిడ్ తో పోరాడిన భారతి.. చివరకు కన్ను మూసిందని, ఆమెను కాపాడుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఉద్వేగానికి లోనయ్యారు.