Begin typing your search above and press return to search.

ట్రైలర్ అనుకొని సినిమానే రిలీజ్ చేశారు..

By:  Tupaki Desk   |   4 July 2018 11:47 AM GMT
ట్రైలర్ అనుకొని సినిమానే రిలీజ్ చేశారు..
X
ప్రఖ్యాత సంస్థ సోని చేసిన పనికి నెటిజన్లు అందరూ ఫిదా అవ్వగా.. సంస్థకు మాత్రం ఆర్థికంగా పెద్ద బొక్క పడింది. సోని సంస్థ తాజాగా నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘ఖాళీ ద కిల్లర్’. జాన్ మథ్యూస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోయి పొరపాటున మూవీ లింక్ ను సోని సంస్థ షేర్ చేసింది. ఇంటర్ నెట్ లో కొత్త సినిమా మొత్తం కనపడడంతో నెటిజన్లు పైసా ఖర్చు లేకుండా చూసేశారు. కొందరైతే ఏకంగా డౌన్ లోడ్ చేసుకొని పంచుకున్నారు. దాదాపు 8 గంటల పాటు ఈ మూవీ ఆన్ లైన్ లో ఉంది.

సోని చేసిన ఈ పొరపాటుకు నెటిజన్లు మాత్రం పండుగ చేసుకున్నారు. సోని సంస్థకు కృతజ్ఞత చెబుతూ ట్వీట్లు చేశారు. ‘హహహ.. సోని సంస్థ ఖాళీ ద కిల్లర్ మూవీ ట్రైలర్ ను అప్ లోడ్ చేయాలనుకుంది. అయితే పొరపాటున మూవీ లింక్ ను పోస్టు చేసింది. నేను ఈ మూవీ మొత్తం చూశాను’ అంటూ రాకో బాట్టే అనే ట్విట్టర్ ఫాలోవర్ ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఫొటోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ పొరపాటును గ్రహించిన సోని సంస్థ మూవీని డిలేట్ చేసినా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. 89 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న మూవీని సోని పిక్చర్స్ సంస్థ తన పొరపాటు వల్ల ఉచితంగా అందరికీ చూపించినట్టైంది.