Begin typing your search above and press return to search.
కపిల్ కు సోనీ దెబ్బతో...రూ.110 కోట్ల లాస్!
By: Tupaki Desk | 29 March 2017 5:10 AM GMTసోనీ టీవీలో ప్రసారమవుతున్న పాపులర్ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇకపై ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోమని సోనీ టీవీ ప్రకటించేసింది. చాలా కాలంగా ప్రసారమవుతున్న ఈ షోతో అటు సోనీ టీవీతో పాటు ఇటు ప్రముఖ యాంకర్ కపిల్ శర్మకు కూడా భారీ లాభాలే వచ్చాయి. ఈ షోతోనే కపిల్ శర్మ దేశవ్యాప్తంగా విశేష ప్రచారం పొందాడు. అంతేకాదండోయ్... అతడిని ఈ షో కోటీశ్వరుడిని కూడా చేసింది. అయితే పాపులారిటీతో వచ్చిన పొగరుతో కపిల్ చేసిన ఓ చిన్న తప్పిదం అతడిని ఉన్న పళంగా అధోఃపాతాళానికి నెట్టేసిందనే చెప్పాలి.
ఇక అసలు విషయంలోకి వస్తే... కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ లో కీలక రోల్ పోషిస్తున్న సునీల్ గ్రోవర్ తో కపిల్ తాగిన మైకంలో గొడవపడ్డాడు. మద్యం మత్తులో విమానంలోనే గ్రోవర్ పై గొడవకు దిగిన కపిల్... అతడి చెంప చెళ్లుమనిపించాడు. అంతటితో ఆగని కపిల్ తన కాలుకున్న బూటును కూడా గ్రోవర్ పైకి విసిరేశాడు. విమానంలో ప్రయాణికులందరి ముందు జరిగిన ఈ గొడవ సంచలనంగానే మారిపోయింది. తలకెక్కిన మద్యం మత్తు దిగాక.. జరిగిన తప్పును తెలుసుకున్న కపిల్... గ్రోవర్ తో కాళ్ల బేరానికి వచ్చాడు.
అయితే అందరి ముందు తనకు జరిగిన అవమానానికి సారీతో సరిపెట్టుకునేందుకు గ్రోవర్ ససేమిరా అన్నాడు. అంతేకాకుండా తన టీమ్ తో పాటు షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రకటించడమే కాదండోయ్... అన్నంత పనిచేస్తూ తన టీమ్‌తో షోకు రాంరాం చెప్పేసి వెళ్లిపోయాడు. ఫలితంగా కపిల్ షోకు జనాదరణ పడిపోగా, సోనీ టీవీ టీఆర్పీ రేటింగ్ కూడా దారుణంగడా పడిపోయిందట. ఈ ఉదంతంతో షాక్ తిన్న సోనీ కూడా కఠిన నిర్ణయమే తీసుకుంది. కపిల్ షోను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఫలితంగా కపిల్‌తో సోనీ సంస్థ చేసుకున్న రూ.110 కోట్ల డీల్ ఒక్క దెబ్బకు క్యాన్సిల్ అయిపోయింది.
ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి దారి తీసిన కారణాలను వివరించిన సోనీ... కపిల్, గ్రోవర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము యత్నించామని, అయితే ఆ యత్నం బెడిసికొట్టిందని తెలిపింది. గ్రోవర్ లేని కపిల్ షోలో కామెడీ క్రమేణా తగ్గిపోయిందని, ఈ కారణంగానే కపిల్ తో కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు వివరించింది. ఇదిలా ఉంటే... ఒక్క చిన్న తప్పిదంతో కపిల్ కు షో రద్దు కావడంతో పాటు రూ.110 కోట్ల డీల్ క్యాన్సిల్ కావడమే కాకుండా... ప్రయాణికుల ముందు రచ్చ చేసిన అతడిపై చర్యలు తీసుకునేందుకు ఎయిర్ లైన్స్ సంస్థ రంగం సిద్ధం చేస్తోందట. అంటే... మద్యం మత్తులో తాను చేసిన బ్లండర్ కు కపిల్ అన్ని రకాలుగా నష్టపోవాల్సి వచ్చిందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/