Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ స్ఫూర్తితో బాలీవుడ్‌ రచ్చ

By:  Tupaki Desk   |   13 July 2015 2:00 AM GMT
టాలీవుడ్‌ స్ఫూర్తితో బాలీవుడ్‌ రచ్చ
X
హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడంలో టాలీవుడ్‌ డైరెక్టర్ల తర్వాతే ఎవరైనా. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీల నుంచి కొత్త నటుణ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ మనోళ్లు భలే టాలెంట్‌ చూపిస్తారు. ఒకప్పుడు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల దగ్గర్నుంచి ఈ తరం యువ కథానాయకుల వరకు హీరోల పరిచయంలో టాలీవుడ్‌ డైరెక్టర్లకు తిరుగులేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ లాంటి హీరో బ్యాగ్రౌండ్‌ లేని కుర్రాణ్ని కూడా గత ఏడాది మన వినాయక్‌ ఇండస్ట్రీకి ఎలా పరిచయం చేశాడో అందరం చూశాం. ఇప్పుడు అఖిల్‌ అరంగేట్రం కూడా ఓ రేంజిలో ఉండబోతోందని ఆ సినిమా మేకింగ్‌ వీడియోలు, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను బట్టే అర్థమైపోయింది.

కొత్త హీరోల్ని పరిచయం చేయడంలో టాలీవుడ్‌ నుంచే స్ఫూర్తి పొందారో ఏంటో కానీ.. బాలీవుడ్‌లో సూరజ్‌ పంచోలి ఇంట్రడక్షన్‌ సినిమా 'హీరో'ను అచ్చం టాలీవుడ్‌ స్టయిల్లోనే ప్రమోట్‌ చేస్తున్నారు. ఆదిత్య పంచోలి కొడుకైన సూరజ్‌కు సంబంధించిన లుక్స్‌ ఇప్పడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ముందుగా కుర్రాడి వీపు మాత్రమే చూపిస్తూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా అతడి కళ్లు చూపించారు. ముఖానికి అడ్డంగా అతను పిడికిలి బిగించగా.. చేతి వేళ్లపై 'రెబల్స్‌ లవ్‌ ఫ్రీడమ్‌' అన్న పదాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌ భలేగా ఉందంటూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మొత్తానికి హీరోల అరంగేట్రం విషయంలో చాలా సింపుల్‌గా ఉండే బాలీవుడ్‌ జనాలు సూరజ్‌ విషయలో మాత్రం టాలీవుడ్‌ స్టయిల్లో హంగామా చేస్తున్నారు. ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌, సుభాష్‌ ఘాయ్‌ కలిసి నిర్మిస్తుండటం విశేషం.