Begin typing your search above and press return to search.

పాపం బాలీవుడ్ కి ఊత‌మిచ్చిన ఏకైక కిలాడీ!

By:  Tupaki Desk   |   6 Nov 2021 7:20 AM GMT
పాపం బాలీవుడ్ కి ఊత‌మిచ్చిన ఏకైక కిలాడీ!
X
మొత్తానికి బాలీవుడ్ మ‌ళ్లీ సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఉద్ద‌వ్ ఠాక్రే మ‌హా-ప్ర‌భుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌కు అనుమ‌తివ్వ‌డంతో వాయిదా ప‌డిన సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతున్నాయి. ఇక దీపావ‌ళి సంద‌ర్భంగా అక్క‌డా సినిమాలు బాగానే రిలీజ్ అయ్యాయి. ఇందులో చెప్పుకోద‌గ్గ చిత్రం `సూర్య‌వంశీ`. అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మాస్ మ‌సాలా యాక్ష‌న్ కామెడీ సినిమా షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఎప్ప‌టి నుంచో రిలీజ్ క్యూలో ఉంది. కొన్ని నెల‌లుగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ముంబైలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండ‌టంతో సూర్య‌వంశీ నిర్మాత‌లు రిలీజ్ కి ధైర్యం చేయ‌లేక‌పోయారు.

ఎట్ట‌కేల‌కు కొవిడ్ ప‌రిస్థితులు పూర్తిగా అదుపులో ఉండ‌టం..థియేట‌ర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవ్వ‌డంతో ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. `సింగం`..`సింబ` త‌ర్వాత విడుద‌లైన కాప్ స్టోరీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దాదాపు 18 నెల‌లు గ్యాప్ త‌ర్వాత సూర్య‌వంశీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కొవిడ్ పీక్స్ లో విడుద‌లైన `బెల్ బాట‌మ్` పాజిటివ్ రివ్యూలు అందుకుని మ‌రీ నిరాశ‌ప‌రిచినా `సూర్య‌వంశీ` మాత్రం రెట్టించిన లాభాలు తీసుకొస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గురించి ట్రేడ్ నిపుణుడు త‌రుణ్ ఆద‌ర్శ మాట్లాడుతూ.. అద్భుత‌మైన ఆరంభం... ప్ర‌స్తుతం థియేట‌ర్లో ఆక్యుపెన్సీ చాలా బాగుంది. 50 శాతం ప‌క్కా ఆక్యుపెన్సీతో సినిమా ర‌న్నింగ్ లో ఉంది. ఈ చిత్రం మొద‌టి రోజు 30 కోట్ల వ‌సూళ్ల‌ను క్రాస్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నాం`` అని తెలిపారు. మ‌రో విశ్లేష‌కుడు కోమ‌ల్ న‌హ‌తా మాట్లాడుతూ..`` సూర్యవంశీ వ‌సూళ్లు అసాధార‌ణంగా ఉన్నాయి. తొలి రోజు 25 కోట్లు వ‌సూళ్లు క్రాస్ చేసి ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో మంచి వ‌సూళ్లని చారిత్రాత్మ‌కంగానే చెప్పాలి. మ‌హ‌రాష్ట్ర‌...గోవా..బీహార్..జార్ఖండ్ రాష్ర్టాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్లు న‌డుస్తున్నాయ‌``న్నారు.

సాధార‌ణ రోజుల్లో ఇదే సినిమా తొలిరోజున‌ 40-45 కోట్లకు చేరేద‌ని ఓ అంచ‌నా. కానీ ఇప్పుడు 25 నుంచి 30 కోట్ల మ‌ధ్య‌లో వ‌సూళ్లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ కి ఇది ఆశ‌లు పెంచే త‌రుణ‌మే. సూర్య‌వంశీతో బౌన్స్ బ్యాక్ అయిన‌ట్టేన‌ని చెప్పొచ్చు. త‌దుప‌రి బాలీవుడ్ లో రిలీజ్ కానున్న అమీర్ ఖాన్ -నాగ‌చైత‌న్య లాల్ సింగ్ చ‌ద్దాకి ఇది ప్ల‌స్ కానుంది. కోవిడ్ స‌మ‌యంలో ప్రేక్ష‌కులంతా ఓటీటీకి అల‌వాటు ప‌డ్డారు. అయినా థియేట‌ర్లు తెరిచే స‌రికి ఇటువైనే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇది మంచి ప‌రిణామం. థియేట‌ర్లో న‌లుగురితో క‌లిసి సినిమా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంద‌ని సౌతిండ‌స్ట్రీలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్ర‌సీమ‌లో ఆడియెన్ కి ఈ క‌ల్చ‌ర్ ఉండ‌డం క‌లిసొస్తోంది. విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ‌లు కంబ్యాక్ అవ్వ‌డంపై ట్రేడ్ నిపుణులు సైతం సంతోషం వ్య‌క్తం చేసారు.